PGIMER Recruitment 2022: జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ సహా 256 గ్రూప్ ఏబీసీ పోస్టులు-pgimer recruitment 2022 for 256 group abc posts junior administrative vacancies know eligibility salary age limit here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pgimer Recruitment 2022 For 256 Group Abc Posts Junior Administrative Vacancies Know Eligibility Salary Age Limit Here

PGIMER Recruitment 2022: జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ సహా 256 గ్రూప్ ఏబీసీ పోస్టులు

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 09:52 AM IST

PGIMER Recruitment 2022: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

PGIMER Recruitment 2022: పీజీఐఎంఈఆర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
PGIMER Recruitment 2022: పీజీఐఎంఈఆర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

PGIMER Recruitment 2022: పీజీఐఎంఈఆర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 256 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హులైన అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం 256 పోస్టుల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ, అలాగే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1నే ప్రారంభమైంది. నవంబరు 28 వరకు గడువు ఉంది. ఈ పోస్టులకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలు ఇవే..

Vacancy Details: పీజీఐఎంఈఆర్ రిక్రూట్మెంట్ వేకెన్సీ వివరాలు ఇవే

  • గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల సంఖ్య: 223 పోస్టులు
  • జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు: 33 పోస్టులు
  • గ్రూపు ఏ పోస్టుల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టు ఒకటే ఉంది.
  • గ్రూపు బీ పోస్టుల్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు 1, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 195, స్టోర్ కీపర్ పోస్టులు 01, జూనియర్ లాబ్ టెక్నీషియన్ పోస్టులు 10, జూనియర్ టెక్నిషియన్ (ఎక్స్-రే) పోస్టులు 02, జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు 01 ఉన్నాయి.
  • గ్రూప్ సీ పోస్టుల్లో మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు 02, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఎల్డీసీ) పోస్టులు 04, సీఎస్ఆర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులు 02 ఉన్నాయి. అలాగే లాబరేటరీ అటెండెంట్ గ్రేడ్-2 పోస్టులు 02, మేనీఫోల్డ్ టెక్నీషియన్ గ్రేడ్-4 పోస్టులు 02 ఉన్నాయి.

Eligibility Criteria: పీజీఐఎంఈఆర్ రిక్రూట్మెంట్ అర్హతలు

పీజీఐఎంఈఆర్ రిక్రూట్మెంట్‌కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థుల వయోపరిమితి, విద్యార్హతలు ఇవే.

మెడికల్ ఆఫీసర్ పోస్టు: వేతనం: రూ. 56,100-1,77,500

వయో పరిమితి: 18-30 ఏళ్లు

విద్యార్హతలు: స్టేట్ మెడికల్ కౌన్సిల్ అయి ఉండాలి. ఫ్యామిలీ ప్లానింగ్, ఎడ్యుకేషన్ మెథడ్స్‌లో శిక్షణ పొంది ఉండాలి. పీజీ, డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ పోస్టు: వేతనం రూ. 44,900-రూ. 1,42,400

వయో పరిమితి: 18-40 ఏళ్లు

విద్యార్హతలు: డిగ్రీ, ఐదేళ్ల అనుభవం

నర్సింగ్ ఆఫీసర్ పోస్టు: వేతనం రూ. 44,900-రూ. 1,42,400

వయో పరిమితి: 18-35 ఏళ్లు

అర్హతలు: బీఎస్సీ (హానర్స్) లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా నర్స్‌గా లేదా మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్ అయి ఉండాలి. లేదా జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ నుంచి డిప్లొమా కలిగి ఉండాలి.

వయస్సు, వేతనం, అర్హతల కోసం పూర్తి నోటిఫికేషన్ కోసం కింది సమగ్ర నోటిఫికేషన్ చూడండి.

Selection Process: ఎంపిక ప్రకియ ఇదే..

అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తరువాత ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సీబీటీలో ఎంపిక కావాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులైతే 35 శాతం మార్కులు సాధించాలి.

Application Fees: దరఖాస్తు రుసుం

  • దివ్యాంగులైతే దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఛార్జీలు అదనంగా భరించాలి.
  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 1500, అలాగే ట్రాన్సాక్షనల్ ఛార్జీలు చెల్లించాలి.

IPL_Entry_Point

టాపిక్