CJI Chandrachud: “ప్రజలకు సహనం తగ్గింది.. జడ్జిలను కూడా..”: సీజేఐ చంద్రచూడ్-people are short in patience says cji chandrachud ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  People Are Short In Patience Says Cji Chandrachud

CJI Chandrachud: “ప్రజలకు సహనం తగ్గింది.. జడ్జిలను కూడా..”: సీజేఐ చంద్రచూడ్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 04, 2023 08:33 AM IST

CJI Chandrachud: కొందరు ప్రజల్లో సహనం తక్కువగా ఉందని, వారి సొంత అభిప్రాయాలకు విరుద్ధమైన విషయాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై కూడా కొందరు ట్రోలింగ్ చేస్తున్నారని ఆయన అన్నారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (PTI)
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (PTI) (HT_PRINT)

CJI Chandrachud: సుప్రీం కోర్టు ప్రధాన నాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ వార్తలు విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో నిజం కూడా కష్టాలను ఎదుర్కొంటోందని, విక్టిమ్‍గా మారుతోందని అన్నారు. కొందరికి సహనం లేకపోవడం ఆధునిక కాలంలో ఒకానొక పెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పారు. అమెరికన్ బార్ అసోసియేషన్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. వ్యక్తిగత నమ్మకాలకు విరుద్ధమైన భావాలను కొందరు అసలు అంగీకరించే స్థితిలో లేరని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

ట్రోలింగ్ తప్పడం లేదు

CJI Chandrachud: ప్రస్తుత కాలంలో నిజం కూడా కష్టాన్ని ఎదుర్కొంటోందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సోషల్ మీడియా ప్రస్తుతం విపరీతంగా వ్యాపించిందని, జడ్జిలు కూడా ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోతున్నారని అన్నారు. “నేను చెప్పేది నమ్మండి. దీనికి మేం మినహాయింపు కాదు. మేం చేసే ప్రతీ పనిని కొందరు ట్రోల్ చేస్తుంటారు. ప్రజలకు సహనం తక్కువగా ఉన్న కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. వారి అభిప్రాయాలకు భిన్నమైన మన దృక్కోణాన్ని ఇష్టపడేందుకు కొందరు సిద్ధంగా లేరు. అందుకే వారిలో సహనం తక్కువగా ఉంటోంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

టెక్నాలజీ పర్యవసానాలు నియంత్రణ లేకుండా ఉండడం సమాజం ఎదుర్కొంటున్న ప్రమాదం అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

దేశంలో ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉండాలన్న డిమాండ్‍ను కూడా సీజేఐ చంద్రచూడ్ ప్రస్తావించారు. “సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు ఎక్కువగా ఎందుకు లేరు, హైకోర్టులో ఎందురు లేరనే ప్రశ్నలు నాకు తరచూ ఎదురవుతుంటాయి. దీనికి సమాధానం అంత సులభం కాదు. సమాధానం కాస్త క్లిష్టంగా ఉంటుంది” అని చీఫ్ జస్టిస్ అన్నారు.

సుప్రీం కోర్టుకు జడ్జిలు హైకోర్టుల నుంచే వస్తారని ఆయన తెలిపారు. ఈ తరం ప్రారంభంలో న్యాయవిభాగంలో కెరీర్ మొదలుపెట్టిన వారే 2023లో సుప్రీంకోర్టులో నియమితులవుతున్నారని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. అంటే రెండు దశాబ్దాల క్రితం మహిళా న్యాయమూర్తులుగా కెరీర్ మొదలుపెట్టిన వారు తక్కువగా ఉండడమే, ప్రస్తుతం సుప్రీంలో మహిళా జడ్జిలు తక్కువగా ఉండేందుకు కారణమేలా ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవాద వృత్తిలో భిన్నత్వాన్ని పెంచేందుకు ఓ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జిల్లాస్థాయిలో మహిళా జడ్జిల సంఖ్య పెరుగుతోందని అన్నారు. జిల్లా న్యాయ విభాగాల నియామకాల్లో ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో 50 శాతానికి కంటే ఎక్కువ మంది మహిళలు ఎంపికవుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయని ఆయన అన్నారు. మహిళలకు విద్య ఎంత ఎక్కువ అందితే.. సమాజం అంత మెరుగవుతుందని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

IPL_Entry_Point

టాపిక్