Air India reviews alcohol serving policy: ఆ ఘటనపై పెద్ద ఎత్తున ఎయిర్ ఇండియా(Air India)పై, విమానంలోని పైలట్, ఇతర సిబ్బందిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ విమానయాన సంస్థ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది.,Air India initiates disciplinary action: ఉద్యోగుల సస్పెన్షన్నవంబర 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు మద్యం మత్తులో వృద్ధురాలైన ఒక సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన విషయంలో అమానవీయంగా వ్యవహరించిన ఫ్లైట్ సిబ్బంది, పైలట్ పై ఎయిర్ ఇండియా సంస్థ క్రమ శిక్షణ చర్యలు చేపట్టింది. నలుగురు ఫ్లైట్ సిబ్బంది, ఒక పైలట్ ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తప్పు చేసినట్లుగా తేలితే, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. విమానంలో దురుసుగా, అనాగరికంగా ప్రవర్తించే ఘటనలపై వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఉద్యోగులందరిని ఆదేశించింది. ఒకవేళ, సదరు ఘటనపై రాజీ కుదిరినా, ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడం తప్పని సరి అని పేర్కొంది. ఈ విషయంలో స్టాఫ్ అందరికీ శిక్షణ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా సీఈఓ (Air India CEO Campbell Wilson) క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు. ,Air India reviews alcohol serving policy: మద్యం పాలసీపై సమీక్షవిమానంలో మద్యం సరఫరా చేసే విషయంపై సమీక్ష జరుపుతామని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ (Air India CEO Campbell Wilson) వెల్లడించారు. అయితే, ఈ విషయంపై పూర్తి వివరాలు ఆయన వెల్లడించలేదు. ఎయిర్ ఇండియా విమానాల్లో మద్యం సరఫరా చేసే విధానాన్ని సమీక్షించాలని నిర్ణయించామని మాత్రం వెల్లడించారు. సహ ప్రయాణికురాలిపై మూత్రం పోసిన శంకర్ మిశ్రాను 30 రోజుల పాటు తమ విమానాల్లో ప్రయాణించకుండా ఎయిర్ ఇండియా నిషేధం విధించిన విషయం తెలిసిందే.