Pathaan movie : పఠాన్​.. షారుక్​ ఖాన్​కే కాదు- కశ్మీర్​కి కూడా జోష్​ తెచ్చింది.. 32ఏళ్ల తర్వాత ఇలా..!-pathaan movie kashmir theatre gets housefull after 32 years inox grateful to king khan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pathaan Movie: Kashmir Theatre Gets Housefull After 32 Years, Inox Grateful To King Khan

Pathaan movie : పఠాన్​.. షారుక్​ ఖాన్​కే కాదు- కశ్మీర్​కి కూడా జోష్​ తెచ్చింది.. 32ఏళ్ల తర్వాత ఇలా..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 27, 2023 10:50 AM IST

Pathaan movie in Kashmir : పఠాన్​ సినిమా షారుక్​ ఖాన్​తో పాటు కశ్మీర్​కి కూడా ప్రత్యేకంగా నిలిచింది! 32ఏళ్ల తర్వాత.. కశ్మీర్​ లోయలో తొలిసారిగా ఓ సినిమాకు ‘హౌజ్​ఫుల్​’ బోర్డు పడటం విశేషం.

32ఏళ్ల తర్వాత కశ్మీర్​ థియేటర్లలో 'హైజ్​ఫుల్​' బోర్డు!
32ఏళ్ల తర్వాత కశ్మీర్​ థియేటర్లలో 'హైజ్​ఫుల్​' బోర్డు!

Pathaan movie in Kashmir : ఉగ్రదాడులు, ఎన్​కౌంటర్​లతో నిత్యం అల్లకల్లోలంగా ఉండే కశ్మీర్​లో పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. అక్కడ కనిపిస్తున్న 'పఠాన్​' మేనియా ఇందుకు కారణం! బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నటించిన పఠాన్​ చిత్రం.. కశ్మీర్​లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఎంతలా అంటే.. 32ఏళ్లల్లో తొలిసారిగా అక్కడి థియేటర్లలో 'హౌజ్​ఫుల్​' బోర్డు కనిపించేంతగా!

ట్రెండింగ్ వార్తలు

కశ్మీర్​కు కొత్త జోష్​..!

పఠాన్​ సినిమా షారుక్​ ఖాన్​ కెరీర్​లో అత్యంత కీలకం! బాలీవుడ్​ బాద్​షా.. ఓ హిట్​ కొట్టి చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు పఠాన్​కు బ్లాక్​బస్టర్​ రెస్పాన్స్​ వస్తుండటంతో ఎట్టకేలకు షారుక్​ ఖాతాలో హిట్​ పడినట్టు అయ్యింది. అయితే.. ఈ పఠాన్​.. షారుక్​ ఖాన్​కే కాదు, కశ్మీర్​కు కూడా ప్రత్యేకమే! పఠాన్​ కారణంగా.. కశ్మీర్​లోని థియేటర్లు కళకళలాడుతున్నాయి. 32ఏళ్ల తర్వాత.. అక్కడ 'హౌజ్​ఫుల్​' బోర్డు కనిపించడం విశేషం.

Pathaan movie collections : "ఇప్పుడు దేశంలో పఠాన్​ ట్రెండ్​ నడుస్తోంది. 32ఏళ్ల తర్వాత కశ్మీర్​ లోయలో హౌజ్​ఫుల్​ బోర్డును తీసుకొచ్చిన కింగ్​ ఖాన్​కు ధన్యవాదాలు," అని ఐనాక్స్​ ట్వీట్​ చేసింది.

Pathaan movie day 2 collections పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

బుక్​మైషోలో ఐనాక్స్​ శ్రీనగర్​ శివ్​పోరా థియేటర్​ను చూస్తే.. అక్కడ పఠాన్​కు లభిస్తున్న క్రేజ్​ అర్థమవుతుంది. శుక్రవారం ఆ థియేటర్​లో పఠాన్​కు సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐదు షోలు వేస్తున్నారు. వీటిల్లో చాలా వరకు హౌజ్​ఫుల్​ అయిపోయాయి. మిగితావి.. ఫిల్లింగ్​ ఫాస్ట్​గా ఉన్నాయి. ఇక వీకెండ్​ వస్తుండటంతో 28, 29 తేదీల్లోనూ కశ్మీర్​లో థియేటర్లు కిటకిటలాడుతాయని ట్రేడ్​ వర్గాలు భావిస్తున్నాయి.

Kashmir Inox Theatre : కశ్మీర్​ ఐనాక్స్​లో మూడు స్క్రీన్​లు ఉన్నాయి. 520కుపైగా సీటింగ్​ కెపాసిటీతో ఇవి నడుస్తున్నాయి. ఫుడ్​ కోర్ట్​ వంటివి కూడా ఐనాక్స్​లో ఉన్నాయి.

షారుక్​ ఖాన్​, దీపికా పదుకొణె నటించిన పఠాన్​ సినిమా.. జనవరి 25న విడుదలైంది. కశ్మీర్​లో తొలి రోజు అన్ని షోలు హౌజ్​ఫుల్​ అయ్యాయి! 32ఏళ్ల తర్వత ఇలా జరుగుతుండటంతో.. అక్కడి వ్యాపార వర్గాల్లో కొత్త కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

2022 సెప్టెంబర్​లో..

Shah Rukh Khan Pathaan movie : తీవ్ర అలజడుల మధ్య కశ్మీర్​లోని థియేటర్లు దాదాపు 30ఏళ్లు మూతపడే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్​లో కొన్ని థియేటర్ల్​ రీఓపెన్​ అయ్యాయి. అమీర్​ ఖాన్​ నటించిన లాల్​ సింగ్​ ఛద్దా సినిమాతో అక్కడి బాక్స్​ఆఫీస్​ మళ్లీ పరుగులు తీసింది.

వాస్తవానికి కశ్మీర్​ లోయలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు! 1980 చివరి వరకు.. ఇక్కడ 12కుపైగా థియేటర్లు ఉండేవి. మిలిటెంట్​ బృందాల బెదిరింపులతో.. థియేటర్లను మూసివేయక తప్పలేదు. ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టు కనిపిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం