Parvathipuram Jobs : పార్వతీపురం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 12 కాంట్రాక్టు ఉద్యోగాలు, దరఖాస్తుకు ఈ నెల 12 చివరి తేదీ-parvathipuram women child welfare department 12 contract posts applications invited ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Parvathipuram Jobs : పార్వతీపురం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 12 కాంట్రాక్టు ఉద్యోగాలు, దరఖాస్తుకు ఈ నెల 12 చివరి తేదీ

Parvathipuram Jobs : పార్వతీపురం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 12 కాంట్రాక్టు ఉద్యోగాలు, దరఖాస్తుకు ఈ నెల 12 చివరి తేదీ

HT Telugu Desk HT Telugu
Sep 10, 2024 06:42 PM IST

Parvathipuram Jobs : పార్వతీపురం మన్యం జిల్లాలో స్రీ శిశు సంక్షేమ, ఐసీడీఎస్ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పార్వతీపురం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 12 కాంట్రాక్టు ఉద్యోగాలు
పార్వతీపురం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 12 కాంట్రాక్టు ఉద్యోగాలు

Parvathipuram Jobs : పార్వతీపురం మన్యం జిల్లా ప‌రిధిలోని మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యం, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాల‌యాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు సెప్టెంబర్ 12 ఆఖ‌రు తేదీ. ఆస‌క్తి గ‌ల వారు నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు కోరుతున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలోని ఖాళీగా ఉన్న 12 ఉద్యోగాల‌కు అర్హులైన అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా పీడీ నాగ‌శైల‌జ కోరారు. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను కాంట్రాక్టు ప‌ద్ధతిలో భ‌ర్తీ చేస్తున్నామ‌ని తెలిపారు. ప‌నితీరు ఆధారంగా వారి స‌ర్వీసును కొన‌సాగిస్తామ‌ని పేర్కొన్నారు. ఇందులో అర్హులైన అభ్యర్థుల‌కు మాత్రమే ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఇంట‌ర్వ్యూలు నిర్వహించి నియామ‌కం జ‌రుపుతారు. ఈ ఉద్యోగాల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష ఉండ‌దు. అయితే ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం కంప్యూట‌ర్ ప‌రీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా నియామం చేస్తారు.

ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s31679091c5a880faf6fb5e6087eb1b2dc/uploads/2024/09/2024090324.pdf ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి. అనంత‌రం సంబంధిత స‌ర్టిఫికేట్లను జ‌త‌చేసి, సెప్టెంబ‌ర్ 12 సాయంత్రం 5 గంట‌ల లోపు పార్వతీపురం మన్యం జిల్లా మ‌హిళ‌, శిశు సంక్షేమ, సాధ‌దికారిత అధికారిణి కార్యాల‌యం (రామ‌నంధ‌న‌గ‌ర్‌, స్వామి హాస్పట‌ల్ ఎదురుగా)లో అంద‌జేయాలి.

పోస్టులు...వయో పరిమితి...వేత‌నం

  • మొత్తం 12 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.
  • సెంట్రల్ అడ్మినిస్ట్రేట‌ర్‌-1
  • కేస్ వ‌ర్కర్-1
  • పారా లీగ‌ల్ ప‌ర్సన‌ల్ లాయ‌ర్-1
  • పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్-1
  • సైకో సోష‌ల్ కౌన్సిల‌ర్-1
  • ఆఫీస్ అసిస్టెంట్ (కంప్యూట‌ర్ పరిజ్ఞానం)-1
  • మ‌ల్లీప‌ర్పస్ స్టాప్‌-3
  • సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్‌-3 పోస్టులు

సెంట్రల్ అడ్మినిస్ట్రేట‌ర్‌కు రూ.34,000, కేస్ వ‌ర్కర్‌కు రూ.19,500, పారా లీగ‌ల్ ప‌ర్సన‌ల్ లాయ‌ర్‌కి రూ.20,000, పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్‌కి రూ.19,000, సైకో సోష‌ల్ కౌన్సిల‌ర్‌కు రూ.20,000, ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ. 19,000, మ‌ల్టీప‌ర్పస్ స్టాప్‌కు రూ.13,000, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్‌కు రూ.15,000 వేతనాలు ఉంటాయి. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసే అభ్యర్థుల వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది.

సెంట్రల్ అడ్మినిస్ట్రేట‌ర్ (మ‌హిళ‌-1)

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్‌కు నెల‌కు వేత‌నం రూ.34,000 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. లా, సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, సోష‌ల్ సైన్స్‌, సైకాల‌జీల్లో పీజీ చేసి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి. క‌నీసం ఏడాదిపాటు కౌన్సిలింగ్‌లో అనుభ‌వం ఉండాలి. స్థానిక అభ్యర్థి అయి ఉండాలి.

పారా లీగ‌ల్ ప‌ర్సన‌ల్, లాయ‌ర్ (1)

పారా లీగ‌ల్ ప‌ర్సన‌ల్, లాయ‌ర్‌కు నెల‌కు వేత‌నం రూ.20,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. లాలో డిగ్రీ చేసి ఉండాలి. క‌నీసం మూడేళ్లు ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టుల్లో అనుభ‌వం ఉండాలి. రెండేళ్లు జిల్లా స్థాయి కోర్టులో ప్రాక్టీస్ చేసిన అనుభ‌వం ఉండాలి.

పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్ (మ‌హిళ‌-1)

పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్‌కు వేత‌నం నెల‌కు రూ.19,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. పారా మెడిక‌ల్‌లో ప్రొఫెస‌న‌ల్ డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ ప్రాజెక్టుల్లో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

సోష‌ల్ కౌన్సెల‌ర్ (మ‌హిళ‌-1)

సోష‌ల్ కౌన్సెల‌ర్‌కు వేత‌నం నెల‌కు రూ.20,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సైకాల‌జీ, న్యూరోసైన్స్ లో ప్రొఫెస‌న‌ల్ డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ ప్రాజెక్టుల్లో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

ఆఫీస్ అసిస్టెంట్ (మ‌హిళ-1)

ఆఫీస్ అసిస్టెంట్‌కు నెల‌కు వేత‌నం రూ.19,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. దీనికి అర్హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. డేటా మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

మ‌ల్టీ ప‌ర్పస్ స్టాఫ్ (మ‌హిళ‌-3)

మ‌ల్టీ ప‌ర్పస్ స్టాఫ్‌కు నెల‌కు వేత‌నం రూ.13,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. హైస్కూల్ పాస్ ఉండాలి. ప‌రిజ్ఞానం, అనుభ‌వం ఉండాలి.

సెక్యూరిటీ, నైట్‌ గార్డులు (మ‌హిళ‌-3)

సెక్యూరిటీ, నైట్‌ గార్డుల వేత‌నం నెల‌కు రూ.15,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సెక్యూరిటీగా రెండేళ్ల అనుభవం ఉండాలి.

కేస్ వ‌ర్కర్‌ (1)

కేస్ వ‌ర్కర్‌ వేత‌నం నెల‌కు రూ.19,500 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. లా, సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, సైకాల‌జీ, సోష‌ల్ సైన్స్‌లో డిగ్రీ చేయాలి. క‌నీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం