Parliament special session live : మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
- Parliament special session live : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల లైవ్ అప్డేట్స్ కోసం ఈ హెచ్‌టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి..
Wed, 20 Sep 202302:23 PM IST
Parliament special session live : మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లుకు లోక్ సభలో 454 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. ఇద్దరు సభ్యులు మాత్రం సవరణలు కోరుతూ బిల్లును వ్యతిరేకించారు.
Wed, 20 Sep 202302:18 PM IST
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో కొనసాగుతున్న ఓటింగ్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ కొనసాగుతోంది. వివిధ సబ్ క్లాజ్ లపై, సవరణలపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
Wed, 20 Sep 202302:12 PM IST
‘‘మీ దృష్టిలో మా విలువ ఆవుల కన్నా తక్కువా?’’ - కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ మహువా
women's reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మోదీ ప్రభుత్వ ద్వంద్వ నీతిపై మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లను మరికొన్ని ఏళ్లు వాయిదా వేయడమే ఈ బిల్లు ఎజెండా అని నిప్పులు చెరిగారు.
Wed, 20 Sep 202308:36 AM IST
Women’s reservation bill: ‘నా భర్త కల’; మహిళా రిజర్వేషన్లపై సోనియా గాంధీ ఉద్వేగం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్వప్నం అని ఆమె గుర్తు చేశారు.
Wed, 20 Sep 202305:22 AM IST
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో సోనియా గాంధీ ప్రసంగం
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించేందుకు ఉద్దేశించిన నారి శక్తి వందన్ అధినియం బిల్లుపై చర్చలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ పాల్గొననున్నారు. విపక్ష కాంగ్రెస్ వాదనను ఆమె నాయకత్వంలోనే వినిపించనున్నారు.
Tue, 19 Sep 202312:50 PM IST
Old Parliament building name: పాత పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ పెట్టిన పేరేంటో తెలుసా?
ఇప్పటివరకు పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు జరిగిన భవనానికి ప్రధాని మోదీ కొత్త పేరు పెట్టారు. ఇకపై ఆ భవనాన్ని సంవిధాన్ సదన్ (Samvidhan Sadan -Constitution House - రాజ్యాంగ భవనం) గా సంబోధించాలని ఆయన సూచించారు.
Tue, 19 Sep 202309:21 AM IST
Women's Reservation Bill: ‘నాకు దేవుడిచ్చిన అవకాశం ఇది’- ప్రధాని మోదీ; ‘నారి శక్తి వందన్ అధినియం’గా నామకరణం
Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిర్ణయం తీసుకునే అవకాశం లభించడం తనకు దేవుడిచ్చిన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ‘నారి శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam)గా ఈ బిల్లుకు నామకరణం చేశారు.
Tue, 19 Sep 202308:42 AM IST
ఈ రోజు 3 గంటలకు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు
Women's Reservation Bill: ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుంది. సెప్టెంబర్ 19, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Tue, 19 Sep 202307:46 AM IST
అధీర్ రంజన్ చేతిలో రాజ్యాంగం..
రాజ్యంగంతో కాంగ్రెస్ ఎంపీలు నూతన పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నడిచారు లీడర్ ఆఫ్ అపొజీషన్ అధీర్ రంజన్. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఆయన వెనుకే నడిచారు.
Tue, 19 Sep 202307:28 AM IST
నూతన పార్లమెంట్‌లోకి..
పాత పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్లో కార్యక్రమం ముగిసింది. మోదీతో పాటు ఎంపీలందరు.. నూతన పార్లమెంట్‌లోకి నడుచుకుంటూ వెళ్లారు.
Tue, 19 Sep 202307:27 AM IST
సంవిధాన్ సధన్
పాత పార్లమెంట్ భవనానికి సంవిధాన్ సదన్ అన్న పేరు పెట్టాలను సూచించారు మోదీ.
Tue, 19 Sep 202306:52 AM IST
స్ఫూర్తిదాయకంగా ఉండాలి..
నూతన పార్లమెంట్లో ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం.. భారతీయుల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలని అన్నారు. భారతీయుల కలలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపట్టాలని తెలిపారు.
Tue, 19 Sep 202306:27 AM IST
మోదీ ప్రసంగం..
పార్లమెంట్ నూతన భవనంలో కార్యకలాపాలు మొదలైన సందర్భంగా.. ఎంపీలు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.
Tue, 19 Sep 202305:42 AM IST
సెంట్రల్ హాల్లో కార్యక్రమం..
ప్రస్తుతం.. నూతన పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో కార్యక్రమం జరుగుతోంది. మోదీతో పాటు ఎంపీలు ఇందులో పాల్గొన్నారు.
Tue, 19 Sep 202305:33 AM IST
లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు..
మహిళా రిజర్వేషన్ బిల్లు.. నేడు లోక్‌సభ ముందుకు రానుందని సమాచారం. కాగా.. ఈ విషయంపై బుధవారం సభలో చర్చ జరుగుతుంది. 21న రాజ్యసభలో ఈ అంశంపై చర్చిస్తారు.
Tue, 19 Sep 202305:20 AM IST
కెనడా దౌత్యవేత్త బహిష్కరణ..
మరోవైపు ఇండియా- కెనడా బంధం మరింత బలహీనపడింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించింది కెనడా. తమ దేశంలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇందుకు బదులుగా.. ఇండియా కూడా.. దేశంలోని కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది.
Tue, 19 Sep 202304:35 AM IST
స్పృహ తప్పి పడిపోయిన ఎంపీ..
నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన ఎంపీల ఫొటో సెషన్ మధ్యలో బీజేపీ ఎంపీ నరహరి అమిన్ స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి వారు ఆయనకు మంచి నీళ్లు ఇచ్చారు. అనంతరం ఆయన ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
Tue, 19 Sep 202304:28 AM IST
ఎంపీల ఫొటో సెషన్..
నూతన పార్లమెంట్ భవనంలో ఎంపీల ఫొటో సెషన్ జరిగింది. ప్రధాని మోదీతో పాటు ఉభయ సభల ఎంపీలు ఈ సెషన్లో పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో నూతన పార్లమంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి.
Tue, 19 Sep 202304:07 AM IST
'ఈ బిల్లు మాది..'
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ‘ఈ బిల్లు మాది,’ అని అన్నారు.
Tue, 19 Sep 202303:51 AM IST
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో తొలిసారిగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం తెరపైకి వచ్చింది. 1989లో ఈ విషయంపై రాజ్యాంగాన్ని సవరించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజీవ్ గాంధీ. రూరల్, అర్బన్ ఎన్నికల వ్యవస్థల్లో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ బిల్లు ఉండాలని పేర్కొన్నారు. ఈ బిల్లు లోక్‌సభలో గట్టెక్కినా.. రాజ్యసభలో మాత్రం ఆమోద ముద్రపడలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Tue, 19 Sep 202303:51 AM IST
బిల్లుతో ప్రయోజనం ఏంటి?
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గట్టెక్కితే.. లోక్‌సభతో పాటు అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ లభిస్తుంది.
Tue, 19 Sep 202303:50 AM IST
మహిళా రిజర్వేషన్ బిల్లు..
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశాల్లో ఇది పార్లమెంట్ ముందుకు వస్తుందని సమాచారం.
Tue, 19 Sep 202303:50 AM IST
కొత్త పార్లమెంట్ భవనంలోకి ఎంపీలు..
పార్లమెంట్ స్పెషల్ సెషన్ సోమవారం మొదలైంది. కాగా.. ఈ సమావేశం మంగళవారం నాడు నూతన భవనంలోకి అడుగుపెట్టనుంది. తొలుత.. నూతన భవనంలో ఎంపీల ఫొటో సెషన్ ఉంటుంది. అనంతరం.. ప్రధాని మోదీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని.. ఎంపీలను పార్లమెంట్ లోపలికి తీసుకెళుతారని తెలుస్తోంది.