Pakistan Crisis: ఐఎంఎఫ్ రుణం కోసం పాకిస్థాన్ మరో భారీ నిర్ణయం.. ప్రజలపై మరో భారం!-pakistan economic crisis government raises policy interest rate by 200 bps for imf bailout know full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pakistan Economic Crisis Government Raises Policy Interest Rate By 200 Bps For Imf Bailout Know Full Details

Pakistan Crisis: ఐఎంఎఫ్ రుణం కోసం పాకిస్థాన్ మరో భారీ నిర్ణయం.. ప్రజలపై మరో భారం!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2023 10:02 AM IST

Pakistan Economic Crisis: కీలకమైన పాలసీ వడ్డీ రేటును ఏకంగా ఒకేసారి 200 బేసిస్ పాయింట్లను పెంచింది పాకిస్థాన్. దీంతో ఆ దేశంలో పాలసీ వడ్డీ రేటు 19 శాతానికి చేరింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Pakistan Crisis: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (International Monetary Fund - IMF) నుంచి రుణం కోసం నానా తంటాలు పడుతోంది. ఉద్దీపన ప్యాకేజీ (IMF Bailout) కోసం చర్చలు జరుపుతూనే ఉంది. ఇందులో భాగంగా ఐఎంఎఫ్ విధించిన నిబంధనలను దేశంలో అమలు చేస్తోంది. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం.. పాలసీ వడ్డీ రేటును ఏకంగా 200 బేసిస్ పాయింట్లు అంటే 2 శాతం పెంచేసింది. దీంతో ఆ దేశంలో కీలక పాలసీ వడ్డీ రేటు ఏకంగా 19 శాతానికి చేరింది. ఈ కారణంగా ఆ దేశంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ప్రజలపై భారీ అదనపు భారం పడనుంది. 1.1 బిలియన్ డాలర్ల ఎంఐఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీ కోసం పాకిస్థాన్ తాజా చర్య తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

రికార్డుకు దగ్గరగా..

Pakistan: పాకిస్థాన్ తాజా నిర్ణయంతో ఆ దేశంలో కీలక వడ్డీ రేటు 19 శాతానికి చేరింది. 1996లో ఓ దశలో 19.5 శాతం రికార్డు కాగా.. దానికి ఇప్పుడు అత్యంత చేరువలోకి వచ్చింది ఆ దేశం. వడ్డీ రేటు పెంచిన అనంతరం ఐఎంఎఫ్‍తో మరోసారి వర్చువల్ సమావేశం జరిగిందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది.

Pakistan Crisis: ఐఎంఎఫ్‍ నుంచి దశల వారీగా 6.5 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని పాకిస్థాన్ ఆశిస్తోంది. రుణాలతో దేశాన్ని ప్రస్తుతం గట్టెంక్కించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఐఎంఎఫ్ ఇప్పటికే చాలా నిబంధనలు విధించింది. పాక్ వాటిని అమలు చేస్తోంది. ఇప్పటికే పాక్‍లో పెట్రోల్, డీజిల్ దొరకడం అక్కడి ప్రజలకు గగనంగా మారింది. ధరలు విపరీతంగా అధికమయ్యాయి. నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Pakistan Crisis: నిబంధనలు అమలు చేయడం ద్వారా ఐఎంఎఫ్‍ను ఒప్పించగలమని పాకిస్థాన్ ప్రభుత్వం భావించింది. అయితే పాక్‍లో ఇటీవల 10 రోజులు పర్యటించిన ఐఎంఎఫ్ మిషన్ రుణ మంజూరు గురించి పురోగతి చూపలేదు. దీంతో పాకిస్థాన్ ఆశలు అడియాశలయ్యాయి. దీంతో మరోసారి ఐఎంఎఫ్‍తో చర్చలు జరిపేందుకు పాక్ ప్రయత్నిస్తోంది.

Pakistan Crisis: పాకిస్థాన్ తీవ్రమైన విద్యుత్ కష్టాలను ఎదుర్కొంటోంది. విద్యుత్ ఉత్పత్తికి వనరులు లేక ఆ దేశంలో భారీ కోతలు ఉంటున్నాయి. చాలా పరిశ్రమలు కూడా మూతపడిన పరిస్థితి ఏర్పడింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించటంతో దిగుమతులకు కూడా కష్టంగా మారింది. ఆ దేశంలోని ఆయిల్ కంపెనీలు ముడిచమురును దిగుమతిని తగ్గించేశాయి. దీంతో పెట్రోల్, డీజిల్ దొరగకమే ఆ దేశంలో కష్టమైంది. మరోవైపు ఆ దేశంలోని ఆసుపత్రుల్లో మెడిసిన్ కూడా అయిపోతోందని తాజాగా ఓ నివేదిక బయటికి వచ్చింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం