Pak drone spotted close to international border: సరిహద్దుల్లో మళ్లీ పాక్ డ్రోన్
Pak drone spotted close to international border: పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఒక డ్రోన్ కనిపించింది. పాక్ భూభాగం వైపు నుంచి పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దు ను దాటుకుని వస్తుండగా, బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు.
పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ఒక droneను BSF జవాన్లు గుర్తించారు. వెంటనే కాల్పులు జరపడంతో అది వెనక్కు వెళ్లిపోయింది.
ట్రెండింగ్ వార్తలు
Pak drone spotted close to international border: 18 రౌండ్ల కాల్పులు
ఇటీవలి కాలంలో పాకిస్తాన్ వైపు నుంచి భారత్ భూభాగంలోకి డ్రోన్లు రావడం ఎక్కువైంది. తాజాగా, పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న ఫార్వర్డ్ పోస్ట్ లో విధుల్లో ఉన్న BSF జవాన్లు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ఒక drone ను గుర్తించారు. వెంటనే దానిపై 18 రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో, అది వెనక్కు వెళ్లిపోయింది. అనంతరం, ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అదే ప్రాంతంలో అక్టోబర్ 27 రాత్రి భద్రత బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఆరు ఏకే 47 రైఫిళ్లు, మూడు పిస్టళ్లు, 200 బుల్లెట్లు ఉన్నాయి.