Fire accident at Delhi's Chandni Chowk: చాందినీ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం
Fire accident at Delhi's Chandni Chowk: ఢిల్లీలోని అత్యంత రద్దీ మార్కెట్ అయిన చాందినీ చౌక్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం వరకు మంటలను నియంత్రించలేకపోయారు.
Fire accident at Delhi's Chandni Chowk: గురువారం రాత్రి 9 గంటల సమయంలో చాందినీ చౌక్ లోని భగీరథ్ ప్యాలెస్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. హోల్ సేల్ మార్కెట్లోని ఒక షాపులో మంటలు ప్రారంభమైనట్లు గుర్తించారు. దాదాపు 9.15 గంటల సమయంలో అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు.
ట్రెండింగ్ వార్తలు
Fire accident at Delhi's Chandni Chowk: ఉదయం వరకు మంటలు
దాదాపు 40 మందికి పైగా అగ్ని మాపక సిబ్బంది ఆరు గంటల పాటు శ్రమించినా, మంటలను పూర్తిగా ఆర్పలేకపోయారు. శుక్రవారం ఉదయం వరకు కూడా మంటలు ఎగసిపడ్తూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం 20 మంది వరకు అగ్ని మాపక సిబ్బంది ఇంకా మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్నారు. భగీరథ్ ప్యాలెస్ దాదాపు అగ్నికి ఆహుతయిందని, మార్కెట్లో నిలువ ఉంచిన సామగ్రి పూర్తిగా తగలపడిపోయిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. మార్కెట్లోని 50 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరు కూడా చనిపోయినట్లు కానీ, గాయపడినట్లు కానీ సమాచారం లేదు.