Other courses through NEET: ఎంబీబీఎస్ రాకుంటే నీట్ ద్వారా ఏ కోర్సులు చేయొచ్చు..
Other courses through NEET: నీట్ ద్వారా ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం దక్కకుంటే ఇంకా ఇతర కోర్సులు ఏవి అందుబాటులో ఉన్నాయి?
Other courses through NEET: నీట్ యూజీ 2022 పరీక్షకు మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 9,93,069 మంది అర్హత సాధించారు. మరోవైపు, అన్ని వర్గాలకు నీట్ కట్-ఆఫ్‌లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఈ ఏడాది మెడికల్ సీటు కోసం పోటీ మరింత కఠినంగా మారనున్నాయని సూచిస్తున్నాయి.
దేశంలో ఎంబీబీఎస్ సీట్లు పరిమితం అయినందున, నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన కొద్దిమంది విద్యార్థులు మాత్రమే కోర్సులో ప్రవేశాన్ని పొందగలుగుతారు. అయితే నీట్ అర్హతతో అభ్యర్థులు పరిగణించగల అనేక ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
నీట్ ఆయుష్ కోర్సులు
ఆయుష్ కోర్సులలో BAMS, BSMS, BUMS, BHMS ఉన్నాయి. MBBS లాగానే, ఆయుష్ సీట్లు కూడా ఆల్ ఇండియా, స్టేట్ కోటాలుగా విభజించి ఉన్నాయి. 15% ఆల్ ఇండియా కోటా సీట్ల కోసం అభ్యర్థులు ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC) కింద దరఖాస్తు చేసుకోవాలి. 85% రాష్ట్ర కోటా సీట్ల కోసం రాష్ట్రాలు వాటి సొంత కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సెలింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్ aaccc.gov.in లేదా ఈ డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి.
BSc నర్సింగ్, BSc లైఫ్ సైన్సెస్
2022 నుండి BSc నర్సింగ్, BSc లైఫ్ సైన్సెస్ కోర్సులలో ప్రవేశానికి కూడా NEET ఫలితాలు ఉపయోగిస్తున్నారు. నీట్ ద్వారా బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్‌లు, రాష్ట్ర, కేంద్ర కౌన్సెలింగ్ అధికారుల వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు.
BDS కోర్సులు
MBBS, ఆయుష్ లాగానే భారతదేశంలో BDS సీట్లు కూడా AIQ (సెంట్రల్ పూల్), రాష్ట్ర కోటాలుగా 15:85 నిష్పత్తిలో విభజించారు. రాష్ట్రాలు తమ వాటా సీట్ల కోసం సొంతంగా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తాయి.
ఆల్ ఇండియా కోటా యొక్క BDS కౌన్సెలింగ్ కోసం, అభ్యర్థులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
BVSc, AH ప్రవేశం
15 శాతం AIQ సీట్లకు BVSc, AH కోర్సుల్లో ప్రవేశానికి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (VCI) కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. AIQ కింద ఈ కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థుల ఎంపిక జమ్మూ, కాశ్మీర్‌లో మినహా భారతదేశంలోని అన్ని వెటర్నరీ కళాశాలల విషయంలో వర్తిస్తుంది.
ఈ కింది కోర్సులకు నీట్ స్కోర్ అవసరం లేదు..
ఆప్టోమెట్రీ
క్లినికల్ సైకాలజీ
రేడియో టెక్నాలజీ
ఫోరెన్సిక్ సైన్స్
ఫిజియోథెరపీ
మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్
బయోటెక్నాలజీ, బ్రీయోమెడికల్ ఇంజనీరింగ్