ఆపరేషన్​ సిందూర్​ : డమ్మీ ఎయిర్​క్రాఫ్ట్​తో పాక్​ని బోల్తా కొట్టించిన భారత వాయుసేన! ‘ప్లాన్​’ ఇదే..-operation sindoor this is how india used unmanned dummy aircrafts to fool pakistan during ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆపరేషన్​ సిందూర్​ : డమ్మీ ఎయిర్​క్రాఫ్ట్​తో పాక్​ని బోల్తా కొట్టించిన భారత వాయుసేన! ‘ప్లాన్​’ ఇదే..

ఆపరేషన్​ సిందూర్​ : డమ్మీ ఎయిర్​క్రాఫ్ట్​తో పాక్​ని బోల్తా కొట్టించిన భారత వాయుసేన! ‘ప్లాన్​’ ఇదే..

Sharath Chitturi HT Telugu

ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత వైమానిక దళం యుద్ధ విమానాల వేషధారణలో ఉన్న డమ్మీ విమానాలను ఉపయోగించి పాకిస్థాన్​ని బోల్తా కొట్టించింది! చైనా సరఫరా చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను లొకేషన్​ని తెలుసుకుని, వాటిని ధ్వంసం చేసింది. అసలేం జరిగిందంటే..

భారత్​ వాయుసేన (Ministry of Defence)

ఏప్రిల్​లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి​ ఆపరేషన్​ సిందూర్​తో భారత్​ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. మే 9-10 మధ్య జరిగిన ఈ ఆపరేషన్​కి సంబంధించిన కీలక విషయాలు తాజాగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్థాన్​ని భారత వాయుసేన తెలివిగా బోల్తా కొట్టించిన ఒక ఘటనకు సంబంధించిన వార్త వైరల్​గా మారింది. ఐఏఎఫ్​ ముందు ఒక డమ్మీ విమానాన్ని పంపి, పాక్​కి చెందిన కీలక మిసైల్​ వ్యవస్థల లొకేషన్​లు పసిగట్టింది. ఆ తర్వాత వాటిపై దాడి చేసిందట!

ఆపరేషన్​ సిందూర్​లో అసలేం జరిగింది?

ఈ ఘటనకు సంబంధించి రక్షణశాఖ వర్గాలు మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా మే 9-10 అర్థరాత్రి వేళ 11 పాకిస్థానీ ఎయిర్​ బేస్​లపై మిసైల్స్​తో భారత్​ దాడి చేసింది. అయితే, మిసైల్స్​ లాంచ్​ చేసే ముందు యుద్ధ విమానాన్ని పోలి ఉండే విధంగా ఒక డమ్మీ విమానాన్ని గాల్లోకి పంపించింది ఐఏఎఫ్​. ఆ విమానాన్ని యుద్ధ విమానంగా భావించిన పాక్​, దాన్ని కూల్చేందుకు తమ హెచ్​క్యూ-9 మిసైల్​ సిస్టెమ్స్​ని యాక్టివేట్​ చేసింది.

ఆ గగనతల రక్షణ వ్యవస్థలు​ యాక్టివేట్​ అయిన వెంటనే, వాటి లొకేషన్ వివరాలు భారత్​కు తెలిసిపోయాయి. వాటిపై మిసైల్స్​తో దాడి చేసి ధ్వంసం చేసింది!

"ఈ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టెమ్స్​ని చైనా పాకిస్థాన్​కి ఇచ్చింది. పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత వీటి లాంచర్లు, రాడార్లను వివిధ లొకేషన్స్​కి తరలించింది. కొన్నింటిని కొత్త కొత్త లోకేషన్స్​లో పెట్టింది. అప్పుడు వాటి వివరాలు తెలియలేదు. కానీ డమ్మీ విమానం పంపడంతో అవి యాక్టివేట్​ అయిన తర్వాత, వాటి లొకేషన్స్​ తెలిశాయి," అని డిఫెన్స్​ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్​ఐ ఒక కథనం ప్రచురించింది.

పాకిస్థాన్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టెమ్స్​ని ధ్వంసం చేసేందుకు భారత్​ బ్రహ్మోస్​, స్కాల్ప్​ వంటి లాంగ్​ రేంజ్​ మిసైల్స్​ని ప్రయోగించింది. వీటి వల్ల పాకిస్థాన్​ వాయుసే నెట్​వర్క్​కి చాలా నష్టం వాటిల్లింది. ఎయిర్​స్ట్రిప్​లు, హ్యాంగర్లు, కమ్యూనికేషన్​ వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

"ఈ దాడులు ఎంత భయానకంగా ఉన్నాయంటే.. భారత్​పై దాడిని ఆపేసి, మనతో చర్చలు జరపాలని పరిగెత్తుకుంటూ వచ్చింది! డీజీఎంఓలు మాట్లాడుకుని భారత సైనిక చర్యలను వెంటనే ఆపేలా చేయాలని పాకిస్థాన్​ ఎయిర్​ బేస్​లు తమ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నాయి," అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

రక్షణ వర్గాల ప్రకారం క్షేత్రస్థాయిలో ఆపరేషన్​ జరుగుతున్నప్పుడు బ్రహ్మోస్​ని ఉపయోగించడం అదే మొదటిసారి.

తేరుకున్న తర్వాత పాకిస్థాన్​ ప్రయోగించిన బాలిస్టిక్​ మిసైళ్లు, క్రూయిజ్​ మిసైళ్లను భారత్​కు చెందిన ఎస్​-400, ఎంఆర్​ఎస్​ఏఎం, ఆకాశ్​ ఎయిర్​ డిఫెన్స్​ మిసైల్​ యూనిట్​లు సమర్థవంతంగా ధ్వంసం చేశాయి.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో భారత్​- పాకిస్థాన్​లు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అప్పటి నుంచి సైనిక స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దు వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.