పాకిస్థాన్​ మిరాజ్​ డౌన్​! ఆపరేషన్​ సిందూర్​పై భారత్​ కీలక ప్రకటన..-operation sindoor india confirms pakistani mirage destroyed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాకిస్థాన్​ మిరాజ్​ డౌన్​! ఆపరేషన్​ సిందూర్​పై భారత్​ కీలక ప్రకటన..

పాకిస్థాన్​ మిరాజ్​ డౌన్​! ఆపరేషన్​ సిందూర్​పై భారత్​ కీలక ప్రకటన..

Sharath Chitturi HT Telugu

పాకిస్థాన్​కి చెందిన మిరాజ్​ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు భారత్​ ప్రకటించింది. అంతేకాదు, పాక్​లోని పంజాబ్​లో ఉన్న రహీమ్​ యార్​ ఖాన్​ వాయు స్థావరంపైనా దాడి చేసినట్టు, ఫలితంగా రన్​వేపై పెద్ద గుంట ఏర్పడినట్టు స్పష్టం చేసింది.

ఆపరేషన్​ సిందూర్​ బ్రీఫింగ్​..

ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా పాకిస్థాన్​కి చెందిన మిరాజ్​ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు భారత్​ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోని ప్రదర్శించింది. పాకిస్థాన్​కి చెందిన మిరాజ్​ శకలాలు ఆ వీడియోలో కనిపించాయి.

ఆపరేషన్​ సిందూర్​, భారత్​- పాక్​ కాల్పుల విరమణ నేపథ్యంలో ఇండియన్​ ఆర్మీ, నేవీ, వాయుసేనలకు సంబంధించిన ఉన్నతాధికారులు సోమవారం నిర్వహించిన ప్రెస్​ బ్రీఫింగ్​లో పలు కీలక వివరాలను వెల్లడించారు.

పాకిస్థాన్​లోని కరాచీకి సమీపంలో ఉన్న ‘టార్గెట్స్​’పై దాడులు నిర్వహించినట్టు వాయుసేన డైరక్టర్​ జనరల్​ ఆఫ్​ ఆపరేషన్స్​ ఎయిర్ మార్షల్​ ఏకే భార్తీ తెలిపారు. అంతేకాదు, పాకిస్థాన్​ పంజాబ్​లోని రహీమ్​ యార్​ ఖాన్​ వాయు స్థావరంపైనా దాడి చేసినట్టు, ఫలితంగా రన్​వేపై పెద్ద గుంట ఏర్పడినట్టు చెప్పారు. ఈ మేరకు పలు వీడియోలను ప్రదర్శించి, దాడి వల్ల కలిగిన నష్టాన్ని వివరించారు.

“కనీర్​ బేస్​పైనా దాడి చేశాము. దాడి తర్వాత ఏమైందో (వీడియోని చూపిస్తూ) మీరే చూడండి. ఇది సోషల్​ మీడియా నుంచే తీసుకున్నాను. రహీమ్​ యార్​ ఖాన్​ ఎయిర్​బేస్​పైనా దాడి చేశాము. రన్​వేపై పెద్ద గుంట పడింది. మన ఆయుధాల ఖచ్చితత్వాన్ని మనం చూడొచ్చు," అని ఏకే భార్తీ తెలిపారు.

“మన వ్యవస్థలు కాలం విసిరిన పరీక్షకు ఎదురు నిలిచాయి. అంతేకాదు, బలంగా ఢీకొట్టాయి. దేశీయంగా తయారు చేసిన ఎయిర్​ డిఫెన్స్ అకాశ్​​ సిస్టెమ్​ మరొక హైలైట్​! విధాన పరంగా దశాబ్ద కాలం పాటు భారత ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, బడ్జెట్​తో ఇదంతా సాధ్యమైంది,” అని ఏకే భార్తీ పేర్కొన్నారు.

పాకిస్థాన్​కు చైనా ఇచ్చిన ఆయుధాలు తుస్​..!

పాకిస్థాన్​ ప్రయోగించిన చైనా ఆధారిత పీఎల్​-15 మిసైల్​ టార్గెట్​ని మిస్​ అయ్యిందని, ఎయిర్​ మార్షల్​ ఏకే భార్తీ వెల్లడించారు.

“చైనాకు చెందిన పీఎల్​-15 మిసైల్​ టార్గెట్​ మిస్​ అయ్యింది. దాని ముక్కలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి,” అని అన్నారు.

‘మా యుద్ధం ఉగ్రవాదంతోనే..’

తమ యుద్ధం ఉగ్రవాదంతోనే అని, ఆపరేషన్​ సిందూర్​ వల్ల పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో జరిగిన నష్టానికి ఆ దేశమే కారణమని భారత సాయుధ దళాలు స్పష్టం చేశాయి.

ఉగ్రవాదులు, వారి మౌలిక వసతులతోనే మా యుద్ధం. పాక్​ ఆర్మీతో కాదు. అందుకే మే7న జరిగిన ఆపరేషన్​ సిందూర్​లో ఉగ్ర స్థావరలపైనే దాడి చేశాము. కానీ ఉగ్రవాదులకు పాక్​ ఆర్మీ మద్దతివ్వడం సిగ్గు చేటు. ఉగ్రవాదులపై దాడిని తమపై దాడిగా భావించింది పాక్​ ఆర్మీ. అందుకే మేము స్పందించాల్సి వచ్చింది. ఆ దేశంలో నష్టాలకు వారే బాధ్యులు,” అని ఏకే భార్తీ వివరించారు.

డీజీఎంఓ చర్చలు వాయిదా..

మరోవైపు భారత్​- పాకిస్థాన్​ డీజీఎంఓ స్థాయి చర్చలు సోమవారం మధ్యాహ్నం జరగాల్సి ఉంది. కానీ ఈ చర్చలు సోమవారం సాయంత్రానికి వాయిదాపడినట్టు అధికారులు వెల్లడించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.