Ind vs Pak Asia cup final : ‘క్రీడా మైదానంలో ఆపరేషన్​ సిందూర్​’- టీమిండియాకు మోదీ అభినందనలు..-operation sindoor again says modi as india beat pak in asia cup final ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ind Vs Pak Asia Cup Final : ‘క్రీడా మైదానంలో ఆపరేషన్​ సిందూర్​’- టీమిండియాకు మోదీ అభినందనలు..

Ind vs Pak Asia cup final : ‘క్రీడా మైదానంలో ఆపరేషన్​ సిందూర్​’- టీమిండియాకు మోదీ అభినందనలు..

Sharath Chitturi HT Telugu

Ind vs Pak Asia cup final : ‘క్రీడా మైదానంలో ఆపరేషన్​ సిందూర్​’ జరిగిందంటూ, అందులోనూ భారత్​దే విజయం అని ప్రధానంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ఈ మేరకు టీమిండియాను అభినందించారు.

భారత్​ వర్సెస్​ పాక్​..

ఆదివారం జరిగిన ఆసియా కప్​ ఫైనల్​లో పాకిస్థాన్​పై గెలిచిన టీమిండియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్​ సిందూర్​ని గుర్తు చేస్తూ ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

“క్రీడా మైదానంలో ఆపరేషన్​ సిందూర్​. ఫలితం మాత్రం ఒక్కటే- భారత్​ గెలుపు,” అని మోదీ ట్వీట్​ చేశారు.

పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్​లోని ఉగ్ర స్థావరాలపై భారత ప్రభుత్వం మే నెలలో ఆపరేషన్​ సిందూర్​ని చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్​ సహా పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్​ దాడి చేసి, వాటిని ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఈ తరుణంలో జరుగుతున్న ఆసియా కప్​లో భారత్​-పాక్​ మ్యాచ్​లను బహిష్కరించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ మ్యాచ్​లు యథాతథంగా కొనసాగాయి. టోర్నీలో పాకిస్థాన్​తో భారత్​ మూడు మ్యాచ్​లు ఆడింది. లీగ్​ దశ, సూపర్​ 4 దశ, ఫైనల్​. మూడింటిలోనూ విజయం సాధించింది.

మరోవైపు ఆసియా కప్​ ఫైనల్​ ఉత్కంఠభరితంగా సాగింది. 147 టార్గెట్​తో బరిలో దిగిన టీమిండియా మొదటి 20 పరుగుల్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తిలక్​ వర్మా, సంజూ శాంసన్​లు జట్టును గట్టెక్కించారు. చివరి ఓవరలో 10 పరుగులు అవసరం ఉండగా, తిలక్​ వర్మా 6, రింకు సింగ్​ బౌండరీతో టీమిండియాను గెలిపించారు.

అనంతరం టీమిండియా ప్లేయర్లను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు.

అయితే, ఆసియా కప్​ని గెలిచినప్పటికీ టీమిండియా సభ్యులు ట్రోఫీని తీసుకోలేదు! ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్​ మంత్రి అయిన మోసిన్​ నఖ్వి నుంచి కప్​ని తీసుకోబోమని టీమిండియా తెల్చిచెప్పడం ఇందుకు కారణం అని తెలుస్తోంది.

గెలిచిన జట్టుకు ట్రోఫీ అందకపోవడం క్రికెట్​ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.