ఏఐ ఉపయోగించి క్యాన్సర్ వ్యాక్సిన్.. 500 బిలియన్ల డాలర్లతో స్టార్‌గేట్ జాయింట్ వెంచర్‌!-open ai softbank and oracle announce ai infrastructure joint venture with 500 billion dollars for cancer cure ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఏఐ ఉపయోగించి క్యాన్సర్ వ్యాక్సిన్.. 500 బిలియన్ల డాలర్లతో స్టార్‌గేట్ జాయింట్ వెంచర్‌!

ఏఐ ఉపయోగించి క్యాన్సర్ వ్యాక్సిన్.. 500 బిలియన్ల డాలర్లతో స్టార్‌గేట్ జాయింట్ వెంచర్‌!

Anand Sai HT Telugu
Jan 22, 2025 11:57 AM IST

AI Infrastructure Joint Venture : సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, ఓపెన్‌ఏఐ, ఒరాకిల్.. అమెరికాలో స్టార్‌గేట్ అనే కొత్త జాయింట్ వెంచర్‌‌ను ప్రారంభిస్తున్నాయి. ఈ వెంచర్ క్యాన్సర్ చికిత్సకు ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించడంపై పని చేయనున్నట్టుగా ఒరాకిల్ సీఈవో లారీ ఎల్లిసన్ ప్రకటించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి రక్త పరీక్షతో క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చని ఒరాకిల్ సీఈవో లారీ ఎల్లిసన్ అన్నారు. క్యాన్సర్ కణితిని జన్యుక్రమం చేసిన తర్వాత ఆ వ్యక్తికి టీకాలు వేయవచ్చని, ఆ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయడానికి ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్‌ని రూపొందించవచ్చని పేర్కొన్నారు.

500 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్

సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, ఓపెన్‌ఏఐ, ఒరాకిల్ అమెరికాలో స్టార్‌గేట్ అనే కొత్త జాయింట్ వెంచర్‌ ప్రారంభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు నిధులు సమకూర్చడానికి 500 బిలియన్ల డాలర్ల జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి సన్, ఒరాకిల్ సీఈవో లారీ ఎల్లిసన్.. చరిత్రలో అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది అని చెప్పారు.

రక్త పరీక్షతో

డేటా సెంటర్‌లు, క్యాన్సర్ పరిశోధన వంటి ప్రాజెక్ట్‌ల కోసం తక్షణమే 100 బిలియన్ల డాలర్లను కేటాయించాలని ఈ వెంచర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐని ఉపయోగించి రక్త పరీక్షతో క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చని, ఆ క్యాన్సర్ కణితిని జన్యుక్రమం టీకాలు వేయవచ్చని చెప్పారు ఒరాకిల్ సీఈవో లారీ ఎల్లిసన్. దాదాపు 48 గంటల్లో ఏఐని ఉపయోగించి క్యాన్సర్‌కు సంబంధించి mRNA వ్యాక్సిన్‌ను రోబోటిక్‌గా తయారు చేయవచ్చన్నారు.

'ప్రముఖ సాంకేతిక దిగ్గజాలు స్టార్‌గేట్ ఏర్పాటును ప్రకటిస్తున్నాయి. ఆ పేరును మీరు రాసిపెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు దీని గురించి చాలా వింటారని నేను భావిస్తున్నాను.' అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్

'ఈ యుగంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని నేను భావిస్తున్నాను. మిస్టర్ ప్రెసిడెంట్ మీరు లేకుండా మేము దీన్ని చేయలేం. ఏఐతో వ్యాధులు నయమవుతాయని చూస్తాం. క్యాన్సర్‌, గుండె జబ్బులను ఎంత త్వరగా నయం చేస్తున్నామో చూసి ఆశ్చర్యపోతాం.' అని ఓపెన్‌ఐఐ సీఈవో ఆల్ట్‌మాన్ అన్నారు..

క్యాన్సర్ వ్యాక్సిన్

'ఓపెన్ఐఏ సామ్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి అందించే సాధనాలను ఉపయోగించి మేం పని చేస్తున్న అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుల్లో క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటి. ఏఐని ఉపయోగించి రక్త పరీక్షతో క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చు. క్యాన్సర్ కణితిని జన్యు క్రమాన్ని ఒకసారి గుర్తించి టీకాలు వేయవచ్చు. ప్రతి వ్యక్తికి ఆ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా టీకాలు రూపొందించవచ్చు.' అని ఒరాకిల్ సీఈవో ఎల్లిసన్ అన్నారు.

కొత్త జాయింట్ వెంచర్ వెంటనే 100 బిలియన్ల డాలర్లను వియోగించనుంది. మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటాయని అమెరికా మీడియా వార్తలు ప్రచురించింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.