Lok Sabha Speaker : ఓం బిర్లాకే లోక్​సభ స్పీకర్​ బాధ్యతలు! మరి పురంధేశ్వరి?-om birla to be lok sabha speaker again says souces ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lok Sabha Speaker : ఓం బిర్లాకే లోక్​సభ స్పీకర్​ బాధ్యతలు! మరి పురంధేశ్వరి?

Lok Sabha Speaker : ఓం బిర్లాకే లోక్​సభ స్పీకర్​ బాధ్యతలు! మరి పురంధేశ్వరి?

Sharath Chitturi HT Telugu
Published Jun 25, 2024 11:42 AM IST

Lok Sabha Speaker : లోక్​సభ స్పీకర్​ పదవి.. మరోసారి ఓం బిర్లాకు దక్కడం దాదాపు ఖాయమైంది. ఫలితంగా.. పురంధేశ్వరి లోక్​సభ స్పీకర్​ అవుతారన్న ఊహాగానాలకు చెక్​ పడింది!

ఓం బిర్లా..
ఓం బిర్లా..

Lok sabha speaker : బీజేపీ ఎంపీ, 17వ లోక్​సభలో స్పీకర్​గా వ్యవహరించిన ఓం బిర్లా.. ఈసారి కూడా ఆ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది! స్పీకర్​ పదవి కోసం ఆయన తన నామినేషన్​ని దాఖలు చేయనున్నట్టు, ఈ మేరకు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసినట్టు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే.. వరుసగా రెండోసారి స్పీకర్​ బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి అవుతారు ఓం బిర్లా.

నిర్ణయం తీసుకున్న బీజేపీ..!

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి స్పీకర్​ పోస్ట్​పై తీవ్ర ఉత్కంఠ కనిపించింది. ఎన్​డీఏలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు స్పీకర్​ పోస్ట్​ కోసం ప్రయత్నిస్టున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్​ బీజేపీ చీఫ్​ పురంధేశ్వరి సైతం.. లోక్​సభ స్పీకర్​ రేసులో ఉన్నట్టు ఊహాగానాలు జోరుగా సాగాయి. మోదీ కేబినెట్​లో ఆమెకు ఎలాంటి మంత్రి పదవి దక్కకపోవడంతో.. స్పీకర్​ పోస్ట్​ అందుకోవడం ఖాయమని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఇవన్నీ రూమర్స్​గానే మిగిలిపోయాయి. కీలకమైన స్పీకర్​ పదవిని తిరిగి ఓం బిర్లాకే అప్పగించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వర్గాల ప్రకారం.. ఓం బిర్లాను లోక్​సభ స్పీకర్​ చేసే విషయంపై.. రక్షణమంత్రి రాజ్​నాథ్​, పార్లమెంట్​ వ్యవహారాల మంత్రి కిరెన్​ రిజిజులు.. అన్ని పార్టీలను సంప్రదించారు. ఈ విషయంపై సోమవారం అర్థరాత్రి వరకు ఇండియా కూటమితో రాజ్​నాథ్​ సింగ్​ చర్చలు జరిపారు. కూటమి మద్దతు పొందేందుకు ప్రయత్నించారు.

Om Birla Lok sabha speaker : అయితే.. అధికార పక్షం తమ స్పీకర్​ అభ్యర్థి నిలబెట్టేంతవరకు వేచి చూడాలని ఇండియా కూటమి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. డిప్యూటీ స్పీకర్​ని ఎంపిక చేసే అవకాశం తమకు ఇవ్వాలని కాంగ్రెస్​తో పాటు ఇండియా కూటమి డిమాండ్​ చేసినట్టు సమాచారం.

18వ లోక్​సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అవ్వగా.. నిన్న, ఇవాళ ఎంపీల ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. కాగా.. మంగళవారం మధ్యాహ్నం నాటికి.. పార్టీలు, తమ స్పీకర్​ అభ్యర్థి గురించి ప్రోటెం-స్పీకర్​కు చెప్పాల్సి ఉంటుంది. బుధవారం.. స్పీకర్​ని ఎన్నుకోనున్నారు.

ఓం బిర్లా.. రాజస్థాన్​ కోటాకు ఎంపీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్​కు చెందిన బలరామ్​ ఝాఖర్​.. 1980 నుంచి 1989 వరకు వరుసగా రెండుసార్లు లోక్​సభ స్పీకర్​గా పనిచేశారు. అంతేకాదు.. లోక్​సభ స్పీకర్​గా పనిచేసిన వ్యక్తి.. తిరిగి ఎంపీగా ఎన్నికవ్వడం 22ఏళ్లలో ఇదే తొలిసారి! 2022లో జీఎంసీ బాలయోగి.. స్పీకర్​గా ఉండగానే మరణించారు. మోహర్​ జోషీ, మీరా కుమార్​లు ఎన్నికల్లో ఓడిపోయారు. సమిత్రా మహాజన్​, సోమ్​నాథ్​ ఛాటర్జీలు రాజకీయాల నుంచి రిటైర్​ అయ్యారు.

లోక్​సభ స్పీకర్​ పోస్ట్​కి ఎందుకంత డిమాండ్​?

స్పీకర్​ను ఎన్నుకునే నియమాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 93లో పొందుపరిచారు. కొత్త లోక్​సభ మొదటిసారి సమావేశం కావడానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అయ్యింది. అంటే ప్రస్తుత సందర్భంలో జూన్ 24.

లోక్​సభ స్పీకర్​ను సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు. అంటే సభలో ఉన్న సభ్యుల్లో సగానికి పైగా ఎంపీలు లోక్​సభ స్పీకర్ కావడానికి సంబంధిత అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.