PM Modi: బీజేపీలో అత్యంత సీనియర్ కార్యకర్త మృతి; మోదీ, అమిత్ షా సంతాపం
Oldest BJP party worker passes away: సుదీర్ఘకాలంగా బీజేపీ కార్యకర్తగా ఉన్న గుజరాత్ కు చెందిన నారాయణ్ అలియాస్ భులాయ్ భాయ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. రాజకీయాలకు, ప్రజా సంక్షేమానికి భులాయ్ భాయ్ చేసిన సేవలను ప్రధాని గుర్తు చేశారు.
Oldest BJP party worker passes away: ఆవిర్భావం నుంచి బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న నారాయణ్ అలియాస్ భులాయ్ భాయ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమానికి అంకితం
‘‘రాజకీయాలకు, సామాజిక సేవకు అమూల్యమైన కృషి చేసిన నారాయణ్ జీ మరణం తీరని లోటు. బీజేపీ అత్యంత సీనియర్ కార్యకర్తలలో ఆయన ఒకరు. భులాయ్ భాయ్ అని కూడా మనం పిలుచుకునే నారాయణ్ జీ ప్రజాసంక్షేమానికి సంబంధించి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ విషాద సమయంలో ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!’’ అని ప్రధాని మోదీ (narendra modi) ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అమిత్ షా సంతాపం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా భులాయ్ భాయ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ విషాద సమయంలో మొత్తం బీజేపీ కుటుంబం అతని కుటుంబానికి అండగా ఉందని అన్నారు. బీజేపీ సీనియర్ కార్యకర్తల్లో ఒకరైన నారాయణ్ జీ అలియాస్ భులాయ్ భాయ్ మరణం చాలా బాధాకరమని అమిత్ షా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘దేశ ప్రయోజనాలకు, జాతికి అంకితమైన భూలాయ్ భాయ్ జనసంఘ్, బీజేపీ ద్వారా సాంస్కృతిక జాతీయవాదం కోసం యువతను ప్రేరేపిస్తూనే ఉన్నారు. ఆయనతో భేటీ సందర్భంగా భావజాలం, జాతీయవాదం పట్ల ఆయన చూపిన ఉత్సాహం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ విషాద సమయంలో బీజేపీ కుటుంబం మొత్తం ఆయన కుటుంబానికి అండగా ఉంది. చనిపోయిన ఆత్మకు భగవంతుడు ఆయన పాదాల వద్ద స్థానం ప్రసాదించాలి. ఓం శాంతి శాంతి శాంతి’’ అని షా (amith shah) ఎక్స్ లో పోస్ట్ చేశారు.
1952 నుంచి..
చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి తో ఉన్న భులాయ్ భాయ్ 1952 లో విజయదశమి నాడు పూర్వపు జనసంఘ్ లో చేరాడు. బీజేపీ వ్యవస్థాపకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యాంప్రసాద్ ముఖర్జీలతో కలిసి భాయ్ పనిచేశారు. 1974, 1977 సంవత్సరాల్లో జనసంఘ్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ (bjp) ఆవిర్భావం నుంచి బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేవారు. గుజరాత్ కు చెందిన అనేక నాయకులు ఆయనకు సుపరిచితం.