CUET-PG Results : ఈ నెల 26 న సీయూఈటీ - పీజీ ఫలితాలు - డైరెక్ట్ లింక్ ఇదే
CUET UG results 2022 : సీయూఈటీ పీజీ ఫలితాలపై అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన రిజల్ట్స్ విడుదల కానున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ ట్వీట్ చేశారు.
CUET UG results 2022 : సీయూఈటీ పీజీ 2022 ఫలితాలపై కీలక అప్డేట్ ఇచ్చారు యూజీసీ ఛైర్మన్ ఎం జగదీశ్ కుమార్. ఈ నెల 26వ తేదీన సాయంత్రం 4 గంటలకు సీయూఈటీ పీజీ ఫలితాలను ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) మే 19వ తేదీన పరీక్ష నిర్వహించారు. ఫలితాలు విడుదలైన తర్వాత cuet.nta.nic.inలో రిజల్ట్ చెక్ చేయవచ్చు. శుక్రవారం CUET పీజీకి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేశారు. సెప్టెంబర్ 16వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదలైంది. దీనిపై అభ్యంతరం తెలిపేందుకు సెప్టెంబర్ 18 వరకు గడువు ఇచ్చారు.
NTA CUET PG 2022 స్కోర్ అధారంగానే 2022-23 అకడమిక్ సెషన్ PG అడ్మిషన్‌లు జరుగుతాయి. అభ్యర్థి ఎంచుకునే విశ్వవిద్యాలయాలు స్కోర్, డేటా అధారంగా సీట్లు లభిస్తాయి.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోవాలి..
https://cuet.nta.nic.in/ వెబ్‌సైట్ సందర్శించాలి.
హోం పేజీలో రిజల్ట్స్ లింక్ క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి.
ఇప్పుడు మీ స్కోర్ కార్డు డిస్‌ప్లే అవుతుంది. దీనిని మీరు భవిష్యత్తు అవసరాల కోసం డౌన్ లోడ్ చేసి పెట్టుకోవాలి.
మార్కింగ్ స్కీమ్
- సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఇవ్వబడతాయి.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
- సమాధానం లేని ప్రశ్నలకు, జీరో మార్కులు ఉంటాయి.
- ఒక ప్రశ్నలో ఒకటి కంటే ఎక్కువ ఎంపికలు సరైనవని తేలితే, ఏదైనా సరైన ఎంపికను గుర్తించిన అభ్యర్థులకు నాలుగు మార్కులు ఇవ్వబడతాయి.
- అన్ని ఎంపికలు సరైనవని తేలితే, ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన అభ్యర్థికి నాలుగు మార్కులు ఇవ్వబడతాయి.
- నాలుగు ఆప్షన్‌లు తప్పు అని, లేదా ప్రశ్న తప్పు అని తేలితే అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు వస్తాయి.
- CUET ఫలితాల్లో టాపర్లు ప్రకటించరు. ర్యాంక్స్‌ను ప్రకటిస్తారు.
ఇటీవల సీయూఈటీ యూజీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దేశంలో సీయూఈటీ యూజీ జరగడం ఇదే తొలిసారి. జులై 14 నుంచి ఆగస్టు 30 వరకు.. దేశంలోని 510కిపైగా నగరాల్లో సీయూఈటీ యూజీ పరీక్ష జరిగింది. ఆరు దశల్లో జరిగిన ఈ ఫలితాలను https://cuet.nta.nic.in/ ద్వారా ర్యాంక్ కార్డును పొందవచ్చు.