JEE Main Exams Schedule 2024 : జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22 వరకు రిజిస్ట్రేషన్
JEE Main Exams Schedule 2024 : దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ, ఐఐటీలతో సహా ప్రముఖ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. నవంబర్ 22 దరఖాస్తుకు చివరి తేదీ.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్(JEE Main 2025) పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. వచ్చే ఏడాదిలో జరిగే ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. సెషన్-1 వచ్చే జనవరిలో, సెషన్-2 , ఏప్రిల్ 2025లో నిర్వహిస్తామని ప్రకటించింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. సెషన్-1 పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. వీటి ఫలితాలు ఫిబ్రవరి 12లోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
జేఈఈ మెయిన్ లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1(బీఈ, బీటెక్)ను ఎన్ఐటీ, ఐఐటీ, సీఎఫ్టీఐ, యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ బీఈ, బీటెక్ ప్రవేశాలకు నిర్వహిస్తారు. అలాగే జేఈఈ మెయిన్ పేపర్-1 ను జేఈఈ అడ్వాన్స్డ్ కు అర్హత పరీక్షగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హతతో ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ మెయిన్ పేపర్-2ను బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్ సెషన్-1(జనవరి 2025) షెడ్యూల్
- ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పణ - అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22, 2024
- ఫీజు చెల్లింపునకు తుది గడువు -నవంబర్ 22, 2024
- పరీక్ష కేంద్రాల ప్రకటన - జనవరి 2025 మొదటి వారంలోపు
- అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ - పరీక్షకు మూడు రోజులు ముందుగా
- పరీక్ష తేదీలు - జనవరి 22 నుంచి జనవరి 31, 2025
- ఫలితాలు విడుదల -ఫిబ్రవరి 12 లోపు
జేఈఈ మెయిన్-2025 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్ సెషన్-1 కు దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఇది అప్లికేషన్ నెంబర్ పై సెషన్-2 దరఖాస్తుకు ఎన్టీఏ అవకాశం కల్పిస్తుంది. ఫీజు చెల్లింపు తప్పనిసరి.
జేఈఈ సెషన్-1 లో రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ మోడ్ లో రోజుకు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తారు.
పేపర్-1 (బీఈ, బీటెక్)లో మ్యాథ్స్, ఫీజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 75 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2A(బీఆర్క్) లో మ్యాథ్స్, అప్టిట్యూడ్, డ్రాయింగ్ టెస్ట్ నుంచి 77 ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2B(బీప్లానింగ్) మ్యాథ్స్, అప్టిట్యూట్, ప్లానింగ్ పేపర్ల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి.
సంబంధిత కథనం