Navodaya Vidyalaya recruitment: నవోదయ విద్యాలయాల్లో భారీగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి
Navodaya Vidyalaya recruitment: దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యా సంస్థల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/nvs ద్వారా అప్లై చేసుకోవచ్చు.
Navodaya Vidyalaya recruitment: నవోదయ విద్యాలయ సమితి (NVS) బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1377 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్టీఏ (NTA) అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/nvs ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 1377
వివిధ పోస్టుల కింద 1377 నాన్ టీచింగ్ ఖాళీల భర్తీ చేస్తున్నారు. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.
- మహిళా స్టాఫ్ నర్సు: 121 ఖాళీలు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 ఖాళీలు
- ఆడిట్ అసిస్టెంట్: 12 ఖాళీలు
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 4
- ఖాళీలు లీగల్ అసిస్టెంట్: 1 ఖాళీలు
- స్టెనోగ్రాఫర్: 23 ఖాళీలు
- కంప్యూటర్ ఆపరేటర్: 2 ఖాళీలు
- క్యాటరింగ్ సూపర్వైజర్: 78 ఖాళీలు
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 ఖాళీలు
- ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 ఖాళీలు
- ల్యాబ్ అటెండెంట్: 161 ఖాళీలు
- మెస్ హెల్పర్: 442 ఖాళీలు
- ఎంటీఎస్: 19 ఖాళీలు
అర్హతలు, ఇతర సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తిగల అభ్యర్థులు navodaya.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు
- అప్లై చేయడానికి లాస్ట్ డేట్: ఏప్రిల్ 30 (సాయంత్రం 5 గంటల వరకు)
- ఫీజు చెల్లింపు గడువు: ఏప్రిల్ 30 (సాయంత్రం 5 గంటలు)
- దరఖాస్తు ఫారం వివరాల్లో సవరణ: మే 2 నుంచి మే 4 వరకు.
- అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
- పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్లు: exams.nta.ac.in/NVS/, navodaya.gov.in
అప్లికేషన్ ఫీజు
స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు ఫీజు మహిళా అభ్యర్థులకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. మిగతా పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతర అభ్యర్థులకు రూ.1,000 ఫీజుగా నిర్ణయించారు. ఈ Navodaya Vidyalaya రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యా సమితి ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్ ఎల్ ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) నాన్ టీచింగ్ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
హెల్ప్ లైన్ నంబర్స్
పరీక్షకు దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా సహాయం కోసం, అభ్యర్థులు ఎన్టీఏ (NTA)ను 011-40759000/ 011-69227700 నంబర్లలో లేదా nvsre.nt@nta.ac.in ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఇతర అప్డేట్ల కోసం navodaya.gov.in నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) అధికారిక వెబ్సైట్ లేదా nta.ac.in, exams.nta.ac.in ఎన్టీఏ వెబ్సైట్లను సందర్శించవచ్చు.