అక్టోబర్ చివరిలో మొదలైన జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. రిజిస్ట్రేషన్స్కి చివరి తేదీ నవంబర్ 22, 2024 అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 1కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు jeemain.nta.ac.in వద్ద ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్లో డైరెక్ట్ లింక్‌ని చూడవచ్చు.
అధికారిక ప్రకటన ప్రకారం.. పరీక్ష సిటీ స్లిప్ 2025 జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష 2024 జనవరి 22 నుంచి జనవరి 31, 2024 వరకు జరుగుతుంది. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
అభ్యర్థులు సెషన్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకుని దానికి అనుగుణంగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపుతో పాటు సెషన్ 2కు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ 2025 దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని అనుసరించవచ్చు.
నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా యూపీఐ సర్వీసుల ద్వారా ఆన్లైన్లో మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు, జీఎస్టీ వర్తించే విధంగా, సంబంధిత బ్యాంక్/పేమెంట్ గేట్ వే ఇంటిగ్రేటర్ ద్వారా అభ్యర్థి నుంచి (పరీక్ష రుసుముతో పాటు) వసూలు చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 అధికారిక ప్రకటనని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం