ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈశాన్య భారతం అల్లాడిపోతోంది! అనేక రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. వీటితో పాటు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం మృతుల సంఖ్య 36కు చేరింది. సోమవారం నాటికి 5.5 లక్షల మందికి పైగా తాజా విపత్తుకు ప్రభావితమయ్యారు. 11 మరణాలతో అసోం అగ్రస్థానంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో 10 మంది, మేఘాలయలో ఆరుగురు, మిజోరంలో ఐదుగురు, సిక్కింలో ముగ్గురు, త్రిపురలో ఒకరు వరదల్లో మరణించారు.
సంబంధిత కథనం