North Korean missile fell in Japan: ఉత్తర కొరియా మరో దుస్సాహసం-north korean missile fell in japan s exclusive economic zone says pm kishida ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  North Korean Missile Fell In Japan's Exclusive Economic Zone, Says Pm Kishida

North Korean missile fell in Japan: ఉత్తర కొరియా మరో దుస్సాహసం

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 05:02 PM IST

North Korean missile fell in Japan: ఉత్తర కొరియా దుస్సాహసాల పరంపర కొనసాగుతోంది. తాజాగా, ఉత్తర కొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి జపాన్ ప్రాదేశిక జలాల్లో పడింది. దీనిపై జపాన్, దక్షిణ కొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం (AP)

North Korean missile fell in Japan: త్వరలో నార్త్ కొరియా మరో అణు పరీక్ష నిర్వహించనుందన్న వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ ల దేశాధినేతలతో చర్చించారు. ఉత్తర కొరియా మిత్రదేశం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తోనూ చర్చించారు. ఉత్తర కొరియా ఒకవేళ అణు పరీక్ష నిర్వహిస్తే అది ఆ దేశం నిర్వహించిన ఏడో అణు పరీక్ష అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

North Korean missile fell in Japan: జపాన్ పై బాలిస్టిక్ మిస్సైల్

ఉత్తర కొరియా శుక్రవారం ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా ఆరోపించింది. వారం రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా ప్రయోగించిన రెండో క్షిపణి ఇది. కాగా, ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి జపాన్ ఉత్తర ప్రాంతంలోని హొక్కైడో సముద్ర జలాల్లో ఉన్న ఎక్స్ క్లూజివ్ ఎకనమిక్ జోన్ లో పడిపోయిందని జపాన్ ప్రధాని ఫ్యుమియొ కిషిదా ప్రకటించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలటరీ కూడా ధ్రువీకరించింది. ఉత్తర కొరియా చర్య తమకు ఎంతమాత్రం ఆమోదనీయం కాదని జపాన్ పీఎం స్పష్టం చేశారు.

North Korea displeased over China Japan talks: నష్టంపై అంచనా లేదు

అయితే, జపాన్ ప్రాదేశిక జలాల్లో పడిన క్షిపణి వల్ల జరిగిన నష్టంపై జపాన్ ఏ వివరణ ఇవ్వలేదు. క్షిపణి పడిన ప్రాంతంలోకి వెళ్లవద్దని అక్కడి నౌకలకు ఆదేశాలు జారీ చేసినట్లు మాత్రం వెల్లడించింది. అలాగే, మూడేళ్ల తరువాత తొలిసారి చైనా, జపాన్ లు ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ సదస్సులో బ్యాంకాక్ వేదికగా చర్చలు జరిపాయి. ఈ చర్చల్లోనూ ఉత్తర కొరియా అణు దూకుడుపైననే ప్రధాన ఎజెండాగా ఉన్నది. ఈ చర్యలు సహా ఉత్తర కొరియా కు వ్యతిరేకంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా క్షిపణి దాడులతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

IPL_Entry_Point