IMD monsoon forecast: ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం; ఐఎండీ-normal monsoon expected this year imd ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Monsoon Forecast: ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం; ఐఎండీ

IMD monsoon forecast: ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం; ఐఎండీ

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 03:08 PM IST

IMD monsoon forecast: ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వాతావరణ విభాగం ప్రకటించింది. ఎల్పీఏ (long-period average LPA) లో 96% వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. 1971 నుంచి 2020 మధ్య నమోదైన వర్షపాతం సగటును ఎల్పీఏ (LPA) గా పరిగణిస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IMD monsoon forecast: ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వాతావరణ విభాగం ప్రకటించింది. ఎల్పీఏ (long-period average LPA) లో 96% వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. 1971 నుంచి 2020 మధ్య నమోదైన వర్షపాతం సగటును ఎల్పీఏ (LPA) గా పరిగణిస్తారు.

yearly horoscope entry point

IMD monsoon forecast: ఎన్ నినో ప్రభావం ఉండదు..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన సమయానికి, అవసరమైన స్థాయిలో కురిసే వర్షాలు చాలా కీలకం. దేశంలోని 47% జనాభా వ్యవసాయంపైననే ఆధారపడి ఉన్నారు. సంవత్సరం మొత్తం నమోదయ్యే వర్షపాతంలో సుమారు 70% వర్షాకాలంలో కురిసే వర్షాల వల్లనే నమోదు కావడం గమనార్హం. ఈ సంవత్సరం జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలంలో వర్షాలు ఎలా ఉండోబోతున్నాయోనన్న ఆదుర్దా ప్రతీ రైతులో ఉంటుంది. ప్రభుత్వ వాతావరణ విభాగం (IMD) ప్రకటించే వర్షపాత అంచనాల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ వాతావరణ విభాగం (India Meteorological Department IMD) ఈ సంవత్సర వర్షాపాత అంచనాలను వెలువరించింది. ఎల్పీఏ (long-period average LPA) లో 96% వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. 1971 నుంచి 2020 మధ్య నమోదైన వర్షపాతం సగటును ఎల్పీఏ (LPA) గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఎల్పీఏ (LPA) గా పరిగణిస్తున్నది 86.86 సెంటీమీటర్ల వర్షపాతం. ఇందులో ఈ సంవత్సరం, 5% అటూ, ఇటుగా 96% వరకు వర్షపాతం నమోదు కావచ్చన్నది IMD అంచనా. అలాగే, ఎల్ నినో (El Nino) ప్రతికూల ప్రభావం ఈ సంవత్సరం ఉండబోదని కూడా ఐఎండీ శుభవార్త తెలిపింది.

IMD monsoon forecast: స్కైమెట్ అంచనా కూడా దాదాపు అదే..

ప్రైవేట్ రంగంలోని వాతావరణ పరిశోధన సంస్థ స్కై మెట్ (Skymet) ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం (below normal rainfall) నమోదవుతుందని ప్రకటించింది. స్కై మెట్ (Skymet) అంచనా ప్రకారం ఎల్పీఏ (LPA) లో, 5% అటు, ఇటుగా 94% వర్షపాతం నమోదవుతుంది. అయితే, ఎల్ నినో (El Nino) బలోపేతమవుతోందని, ఎల్ నినో ప్రభావం వర్షపాతంపై ఉండబోతోందని వెల్లడించింది. ఎల్ నినో (El Nino) ప్రభావం వల్ల సాధారణంగా వేసవి కాలం విపరీతమైన ఉష్ణోగ్రతలు, వర్షాకాలం తక్కువ వర్షపాతం నమోదవుతాయి. ఐఎండీ (IMD) అంచనాల ప్రకారం ఈ సంవత్సరం జూన్, సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం 35%, సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 29% ఉన్నాయి. ఎల్ నినో (El Nino) ప్రభావం ఉన్న అన్ని సంవత్సరాల్లోనూ కచ్చితంగా తక్కువ వర్షపాతమే (below normal rainfall) నమోదవుతుందని భావించలేమని ఐఎండీ (IMD) డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర వివరించారు. 1951 నుంచి 2022 మధ్య మొత్తం 15 ఎల్ నినో (El Nino) ప్రభావ సంవత్సరాలు ఉన్నాయని, వాటిలో 6 సంవత్సరాల్లో సాధారణం (normal), లేదా సాధారణం కన్నా ఎక్కువ (above normal) వర్షపాతం నమోదైందని వెల్లడించారు. యూరేసియా (Eurasia), ఉత్తరార్ధ గోళం (northern hemisphere) లో తక్కువ మంచు కురిసిన పరిస్థితులు కూడా ఈ సంవత్సరం బాగా వర్షాలు కురవడానికి దోహదపడ్తాయి.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.