Man hammers wife : అనుమానం పెట్టిన చిచ్చు- సుత్తితో భార్యను కొట్టి, కొట్టి కిరాతకంగా చంపిన భర్త!-noida man hammers wife to death over suspicion of affair surrenders before police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Hammers Wife : అనుమానం పెట్టిన చిచ్చు- సుత్తితో భార్యను కొట్టి, కొట్టి కిరాతకంగా చంపిన భర్త!

Man hammers wife : అనుమానం పెట్టిన చిచ్చు- సుత్తితో భార్యను కొట్టి, కొట్టి కిరాతకంగా చంపిన భర్త!

Sharath Chitturi HT Telugu

Man kills wife : నోయిడాలో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో, ఆమెను సుత్తితో కొట్టి, కొట్టి హత్య చేశాడు. చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

భార్యను కిరాతకంగా చంపిన నిందితుడు నూర్​

నోయిడాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం అనే భూతంతో అంధుడైన ఓ వ్యక్తి.. తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి, కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు.

ఇదీ జరిగింది..

నోయిడాలోని సెక్టర్​ 15 ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి పేరు నూర్​ ఉల్​ లాహ్​ హైదర్​. అతని వయస్సు 55ఏళ్లు. కంప్యూటర్​ ఇంజినీర్​ గ్యాడ్యుయేట్​ అతను. అతని భార్య పేరు ఆస్మా ఖాన్​ (42). ఒక ప్రైవేట్​ కంపెనీలో సివిల్​ ఇంజినీర్​గా పనిచేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు బీటెక్​ స్టూడెంట్ సమద్​​. ఇంకొకరు 12ఏళ్ల ఇనాయా.

కాగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని నూర్​కి చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదని తెలుస్తోంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం గురువారం ఈ గొడవ మరింత ముదిరింది. దంపతులు రాత్రంగా గొడవపడ్డారు. చివరికి, శుక్రవారం మధ్యాహ్నం బెడ్​రూమ్​ డోర్​ని లాక్​ చేసిన నూర్​.. భార్య మీద దాడి చేశాడు. ఆమెపై దిండు పెట్టి, ఊపిరాడనివ్వకుండా చేశాడు. చివరికి, సుత్తి తీసుకుని ఆమె చనిపోయే దాకా తలపై బలంగా కొట్టాడు. ఆ రక్తం బెడ్​ అంతా చిమ్మింది.

శుక్రువారం మధ్యాహ్నం 1గంటకు సమద్,​ తన తల్లి సోదరి ఫరిదాకు ఫోన్​ చేశాడు. తన తల్లి చనిపోయిందని, తన తండ్రే ఆమెను చంపేశాడని వివరించాడు. బెడ్​ మొత్తం రక్తపుమడుగుగా మారిందని చెప్పాడు. ఫరిదా, ఆమె భర్త ఘటనాస్థలానికి పరుగులు తీశారు.

ఈలోగా భార్యను హత్య చేసిన నిందితుడు నూర్​.. దాదాపు 2 కిలోమీటర్లు నడిచి, పోలీస్​ స్టేషన్​కి వెళ్లి, జరిగినది చెప్పి లొంగిపోయాడు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తన భార్యను చంపినట్టు ఒప్పుకున్నాడు.

"అనుమానంతోనే తన భార్యను చంపినట్టు నూర్​ వెల్లడించాడు. హత్య చేసినందుకు అతను పశ్చాత్తాపం ఏం చూపించలేదు. మేము ఘటనాస్థలానికి వెళ్లాము. ఆస్మా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించాము. ఘటనాస్థలంలో సుత్తిని స్వాధీనం చేసుకున్నాము. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది," ని నోయిడా అదనపు డీసీపీ సుమిత్​ శుక్లా వెల్లడించారు.

కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..

ఈ ఘటనపై ఆస్మా తరఫు కుటుంబసభ్యులు మరికొన్ని వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రంతా గొడవపడటంతో ఆస్మా తన సోదరి, తల్లికి ఫోన్​ చేసి పిలిపించింది. ఆస్మా సోదరి, ఆమె తల్లి.. శుక్రవారం ఉదయం 5 గంటలకు నోయిడాలో ఇంటికి వెళ్లారు. ఆస్మా, నూర్​తో మాట్లాడారు. నూర్​కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఫరిదా ఆమె ఇంటికి వెనుదిరిగింది. ఆస్మా తల్లి, ఆస్మా పిల్లలు ఎవరి గదులకు వాళ్లు వెళ్లిపోయారు. అప్పుడే, ఆస్మా- నూర్​లు తమ రూమ్​ని లాక్​ చేసుకున్నారు. నూర్​ తన భార్యను సుత్తితో కిరాతకంగా హతమార్చాడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భార్యను అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.