TISS NET 2024: ఈ సంవత్సరం టిస్ నెట్ ఉండదు; సీయూఈటీ, క్యాట్ ద్వారానే అడ్మిషన్స్-no tiss net in 2024 admission to postgraduate courses through cuet pg cat only ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tiss Net 2024: ఈ సంవత్సరం టిస్ నెట్ ఉండదు; సీయూఈటీ, క్యాట్ ద్వారానే అడ్మిషన్స్

TISS NET 2024: ఈ సంవత్సరం టిస్ నెట్ ఉండదు; సీయూఈటీ, క్యాట్ ద్వారానే అడ్మిషన్స్

HT Telugu Desk HT Telugu
Nov 15, 2023 10:05 AM IST

TISS NET 2024: భారత్ లోని ప్రముఖ, నాణ్యమైన విద్యను అందించే విద్యా సంస్థల్లో ఒకటైన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (Tata Institutes of Social Sciences TISS) ఈ సంవత్సరం నెట్ నిర్వహించడం లేదు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

TISS NET 2024: పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (Tata Institutes of Social Sciences TISS) ప్రతీ సంవత్సరం నిర్వహించే నెట్ పరీక్షను 2024 -25 విద్యా సంవత్సరంలో నిర్వహించడం లేదు.

టిస్ లో అడ్మిషన్లు ఎలా..?

టిస్ లో పీజీ అడ్మిషన్ల కోసం ప్రతీసంవత్సరం నెట్ పరీక్షను నిర్వహిస్తారు. కానీ, ఈ సంవత్సరం ఆ పరీక్షను నిర్వహించకూడదని టిస్ నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ పీజీ (Common University Entrance Test Postgraduate CUET PG 2024) పరీక్షలో , ప్రముఖ మేనేజ్మెంట్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే క్యాట్ (CAT) పరీక్షలో ఉత్తీర్ణతను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్‌ లో మాస్టర్స్ కోర్సులో ప్రవేశానికి, ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్, చేంజ్, లీడర్ షిప్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సుకు అడ్మిషన్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CAT 2023) ఆధారంగా ఉంటుంది. అన్ని ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల్లో CUET PG స్కోర్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.

ఇతర వర్సిటీల్లో..

TISS ఇన్‌స్టిట్యూట్‌తో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రముఖ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు సీయూఈటీ పీజీ (CUET PG) మార్కుల ఆధారంగా తమ వర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తాయి. ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధిత వివరాల కోసం విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ cuet.nta.nic.in. ను సందర్శించాలి. అలాగే, టిస్ లో అడ్మిషన్ల వివరాల కోసం టిస్ అధికారిక వెబ్ సైట్ admissions.tiss.edu. ను సందర్శించాలి. ఇంతకుముందు, మాస్టర్స్ (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ మరియు BEd-MEd ఇంటిగ్రేటెడ్) ప్రోగ్రామ్‌లలో చేర్చుకోవడానికి జాతీయ స్థాయిలో TISS NET పరీక్షను టిస్ నిర్వహించేది.

Whats_app_banner