RBI: మహాత్ముడి చిత్రం మార్చే ప్రతిపాదనేదీ లేదన్న ఆర్బీఐ-no proposal to replace face of mahatma gandhi on banknotes rbi clarifies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  No Proposal To Replace Face Of Mahatma Gandhi On Banknotes Rbi Clarifies

RBI: మహాత్ముడి చిత్రం మార్చే ప్రతిపాదనేదీ లేదన్న ఆర్బీఐ

HT Telugu Desk HT Telugu
Jun 06, 2022 03:34 PM IST

కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్న మహాత్ముడి చిత్రాన్ని మార్చే ప్రతిపాదనేదీ లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది.

భారతీయ కరెన్సీ నోటుపై మహాత్ముడి చిత్రం
భారతీయ కరెన్సీ నోటుపై మహాత్ముడి చిత్రం (REUTERS)

ముంబై, జూన్ 6: కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రానికి బదులు ఇతర ప్రముఖుల చిత్రాలను ముద్రిస్తారన్న వార్తలను కొట్టిపడేస్తూ.. అలాంటి ప్రతిపాదనేదీ లేదని ఆర్బీఐ సోమవారం తేల్చిచెప్పింది.

ట్రెండింగ్ వార్తలు

కరెన్సీ నోట్లలో పలు మార్పులు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోందని మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయని, మహాత్ముడి ముఖ చిత్రానికి బదులుగా ఇతరుల చిత్రాలు వాడుతారని వార్తలు ప్రచురించారని ఆర్‌బీఐ ఒక నోట్‌లో తెలిపింది. ‘అలాంటి ప్రతిపాదనేదీ లేదని గుర్తుంచుకోవాలి..’ అని ఆర్బీఐ నోట్ స్పష్టం చేసింది.

రవీంద్రనాథ్ టాగోర్, ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి బాగా ప్రాచుర్యం కలిగిన భారతీయ ప్రముఖుల చిత్రాలను కొన్ని నిర్ధిష్ట బ్యాంకు నోట్లపై ముద్రించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నాయని సదరు మీడియా కథనాల్లో ప్రచురితమైంది. అయితే ఇవన్నీ అవాస్తవమని ఆర్బీఐ తేల్చిచెప్పింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్