2000 notes: మూడేళ్లుగా ఒక్క రూ. 2,000 నోటు కూడా ప్రింట్ చేయలేదట
₹2000 notes: గత మూడు సంవత్సరాల్లో కొత్తగా ఒక్క రూ. 2,000 నోటు కూడా ప్రింట్ కాలేదన్న సమాచారం వెల్లడైంది. ఆర్టీఐ కింద దాఖలైన అభ్యర్థనకు వచ్చిన సమాధానం ద్వారా ఈ విషయాలు తెలిశాయి. పూర్తి వివరాలివే..
Rs.2000 notes: గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో కొత్తగా ఒక్క రూ. 2,000 నోటు ముద్రణ కూడా జరగలేదన్న సమాచారం బయటికి వచ్చింది. సమాచార హక్కు చట్టం (RTI) కింద దాఖలైన ఓ అభ్యర్థనకు ఈ సమాధానం వచ్చింది. న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ (IANS) ఈ RTI అభ్యర్థనను చేసింది. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో కొత్త రూ. 2,000 నోట్లు ప్రింట్ కాలేదని సమాచారం తెలిసింది.
ట్రెండింగ్ వార్తలు
Rs. 2000 Notes Printing: క్రమంగా తగ్గుతూ సున్నాకు..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పీ) లిమిటెడ్.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,5429.91 కోట్ల రూ.2,000 నోట్లను ప్రింట్ చేసిందని ఈ ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. 2017-18కి ఈ సంఖ్య బాగా తగ్గింది. ఆ ఆర్థిక సంవత్సరంలో 1115.07 కోట్ల రూ. 2,000 నోట్లను ఆ సంస్థ ప్రింట్ చేసింది. 2018-19 సంవత్సరంలో 466.90 కోట్ల రూ. 2,000 నోట్లు ముద్రణ అయ్యాయి. అయితే గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా ఒక్క రూ. 2,000 నోటు కూడా ప్రింట్ చేయలేదని తాజాగా తేలింది.
2016లో రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక.. ఈ రూ. 2,000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‍బీఐ) తీసుకొచ్చింది. అసలు, నకిలీ నోట్ల మధ్య తేడాను ప్రజలు సులువుగా గుర్తించేలా సెక్యూరిటీ ఫీచర్లతో రూ. 2,000 నోటును రూపొందించింది.
₹2000 Notes: నకిలీ నోట్ల సీజ్ ఇలా..
రూ. 2000 నకిలీ నోట్ల సీజ్ గురించి గతంలో ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) లెక్కల ప్రకారం 2016 సంవత్సరంలో 2,272 నకిలీ రూ.2,000 నోట్లు సీజ్‍కు గురయ్యాయి. అదే 2020లో ఆ సంఖ్య ఏకంగా 2,44,834కు చేరింది.
NCRB గణాంకాల ప్రకారం, 2016లో 2,272 నకిలీ నోట్లు సీజయ్యాయి. 2017లో 74,898, 2018లో 54,776, 2019లో 90,566 నోట్లు పట్టుబడ్డాయి. ఈ సంఖ్య 2020లో గణనీయంగా పెరిగింది. ఆ ఏడాది ఏకంగా 2,44,834 రూ. 2,000 నకిలీ నోట్లు సీజ్ అయ్యాయి. నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో అధికారిక వెబ్‍సైట్‍లో ఆర్‍బీఐ పూర్తి వివరాలను ప్రజల కోసం అందుబాటులో ఉంచింది.