కరోనా వ్యాక్సిన్ గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్వహించిన లోతైన అధ్యయనం ఆధారంగా మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది నడక, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ గుండెపోటుతో మరణించిన సంఘటనలు కనిపించాయి.
ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి షాకింగ్ వీడియోలు బయటకు రావడంతో ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్లపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) అధ్యయనాల్లో భారత్లో కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవని తేలిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన దుష్ప్రభావాల కేసులు చాలా అరుదు అని వెల్లడించింది.
జన్యుశాస్త్రం, జీవనశైలి, ముందుగా ఉన్న సమస్యలు, కొవిడ్ అనంతర సమస్యలతో సహా అనేక కారణాల వల్ల ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ మరణాలు సంభవిస్తాయని తెలిపింది. కరోనా వ్యాక్సిన్లు, ఆకస్మిక మరణాలను ముడిపెట్టే ప్రకటనలు అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కుల ఆకస్మిక మరణాలపై అధ్యయనం జరిగింది. ఈ పరిశోధన రెండు వేర్వేరు మార్గాల్లో జరిగింది.. ఒకటి పాత డేటా ఆధారంగా, మరొకటి రియల్ టైమ్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా.
'జన్యుశాస్త్రం, జీవనశైలి, ముందుగా ఉన్న పరిస్థితులు, కోవిడ్ అనంతర సమస్యలతో సహా అనేక రకాల కారణాల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవించవచ్చు. కోవిడ్ టీకాను ఆకస్మిక మరణాలకు అనుసంధానించే ప్రకటనలు అబద్ధం. తప్పుదారి పట్టించేవి.' అధ్యయనం తెలిపింది.
టాపిక్