No legal compulsion to get COVID vaccine:కరోనా టీకా తప్పక తీసుకోవాలన్న రూలేంలేదు-no legal compulsion to get covid 19 vaccination centre tells sc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  No Legal Compulsion To Get Covid-19 Vaccination, Centre Tells Sc

No legal compulsion to get COVID vaccine:కరోనా టీకా తప్పక తీసుకోవాలన్న రూలేంలేదు

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 04:27 PM IST

No legal compulsion to get COVID vaccine: కోవిడ్ టీకా కచ్చితంగా తీసుకోవాలా? అన్న అంశంపై కేంద్రం మంగళవారం స్పష్టతనిచ్చింది. కోవిడ్ టీకా సైట్ ఎఫెక్ట్స్ తో తమ పిల్లలు చనిపోయారని రెండు జంటలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్రం స్పందించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

No legal compulsion to get COVID vaccine: కోవిడ్ టీకా కచ్చితంగా తీసుకోవాల్సిందేనా? అన్న విషయంపై చాలా మందికి అనుమానాలున్నాయి. టీకా తీసుకోనట్లయితే, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలుంటాయని, టీకా తీసుకోనివారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందవని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్ లో వివరణ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

No legal compulsion to get COVID vaccine: చట్టబద్ధ నిబంధనేమీ లేదు

కోవిడ్ టీకా కచ్చితంగా తీసుకోవాలన్న చట్టబద్ధ నిబంధన(No legal compulsion) ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. టీకా తీసుకోవడం పౌరుల వ్యక్తిగత నిర్ణయంపైననే ఆధారపడి ఉంటుందని తెలిపింది. అయితే, దేశ ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా టీకా తీసుకోవాలని, టీకా తీసుకోవడం క్షేమకరమని ప్రభుత్వం సూచిస్తుందని తెలిపింది. ఇతర ఔషధాలకు దుష్ప్రభావాలు ఉన్నట్లే, కోవిడ్(COVID vaccine) సహా అన్ని టీకాలకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని స్పష్టం చేసింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి సురక్షతంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపింది.

No legal compulsion to get COVID 19 vaccine: సమాచారం అందించాం

కోవిడ్ టీకా(COVID vaccine) కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయా టీకాలను ఉత్పత్తి చేసిన సంస్థ వెబ్ సైట్ లో, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెబ్ సైట్లో ప్రజలందరికీ అందుబాటులో ఉందని వివరించింది. అలాగే, టీకా కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలను వద్ద నుంచి కూడా సైడ్ ఎఫెక్ట్స్ సహా టీకాకు సంబంధించిన సమగ్ర సమాచారం అడిగి తెలుసుకోవచ్చని వెల్లడించింది. అందువల్ల, కోవిడ్ 19 టీకా(COVID 19 vaccine) సైడ్ ఎఫెక్ట్స్ కు సంబందించిన సమాచారం ఇవ్వడం లేదనడం సరికాదని వివరించింది.

No legal compulsion to get COVID 19 vaccine: పిటిషనర్లకు జవాబు

కోవిడ్ టీకా తీసుకున్న తరువాత తమ కూతుర్లు చనిపోయారని, తమకు పరిహారం అందించాలని రెండు జంటలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్పందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కేంద్రం ఈ వివరాలతో అఫిడవిట్ సమర్పించింది. టీకా(COVID 19 vaccine) దుష్ప్రభావం వల్ల ఎవరికైనా అనారోగ్యం లేదా మరణం సంభవిస్తే, వారు లేదా వారి కుటుంబ సభ్యులు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని, కేసుల వారీగా ఆయా పిటిషన్లను కోర్టులు పరిష్కరిస్తాయని కేంద్రం తెలిపింది. అయితే, ప్రస్తుత పిటిషనర్ల పిల్లల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలనడం సరికాదని పేర్కొంది.

WhatsApp channel