Man kills wife : కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త!-no fortuner in dowry woman killed by husband in laws in greater noida ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Kills Wife : కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త!

Man kills wife : కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త!

Sharath Chitturi HT Telugu
Apr 02, 2024 12:15 PM IST

Man kills wife for dowry : కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని.. భార్యను ఓ వ్యక్తి, అతని కుటుంబసభ్యులు చంపేశారు. గ్రేటర్​ నోయిడాలో జరిగింది ఈ దారుణ ఘటన.

కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త!
కట్నంగా ఫార్చ్యునర్​ ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త!

Man kills wife in Greater Noida : గ్రేటర్​ నోయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్నం వేధింపులతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్​తో పాటు రూ. 21లక్షల క్యాష్​ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశారు!

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

గ్రేటర్​ నోయిడాలోని ఖాడా చౌగన్​పూర్​ అనే గ్రామంలో నివాసముండే వికాస్​ అనే వ్యక్తికి.. 2022 డిసెంబర్​లో కరిష్మ అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే.. వికాస్​ కుటుంబానికి రూ. 11లక్షల క్యాష్​తో పాటు ఒక ఎస్​యూవీని కట్నం కింద ఇచ్చింది కరిష్మ కుటుంబం.

కానీ పెళ్లి తర్వాత కూడా కట్నం గురించి కరిష్మను వేధించడం మొదలుపెట్టాడు వికాస్​. అతని కుటుంబం కూడా కరిష్మను వేధించింది. కరిష్మ సోదరుడు దీపక్​ ప్రకారం.. వికాస్​ కుటుంబం అనేకమార్లు కరిష్మను భౌతికంగా, మానసికంగా హింసించింది.

కొన్ని నెలల క్రితం.. వికాస్​-కరిష్మలకు ఆడ బిడ్డ పుట్టింది. ఇక కట్నం వేధింపులు మరింత పెరిగాయి. ఈ వ్యవహారం స్థానిక పంచాయతీ పెద్దల దృష్టికి కూడా వెళ్లింది. రెండు కుటుంబాలు కలిసి, విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా.. తమ కుటుంబం.. వికాస్​ ఫ్యామిలీకి మరో రూ. 10లక్షలు ఇచ్చిందని దీపక్​ చెప్పాడు. అప్పటికీ వరకట్న వేధింపులు ఆగలేదని అన్నాడు.

Man kills wife for Fortuner : కాగా.. కట్నం వేధింపులు ఇటీవలే నెక్ట్స్​ లెవల్​కి వెళ్లాయి. వికాస్​ కుటుంబం.. ఒక ఫార్చ్యునర్​తో పాటు రూ. 21లక్షల కట్నం డిమాండ్​ చేయడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వికాస్​తో పాటు అతని కుటుంబసభ్యులు, తనని కొడుతున్నట్టు, పుట్టింటి వారికి ఫోన్​ చేసి చెప్పింది కరిష్మ. ఆమె కుటుంబసభ్యులు కరిష్మ దగ్గరికి పరుగులు తీశారు. నేల మీద విఘత జీవిగా పడి ఉన్న కరిష్మను చూశారు. ఆమె మరణించిందని తెలుసుకుని విలపించారు.

వికాస్​, అతని తల్లిదండ్రులే.. వరకట్నం కోసం తమ బిడ్డను కొట్టి చంపేశారని కరిష్మ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

Man kills wife : వికాస్​, అతని తండ్రి సోంపాల్​ భాటి, తల్లి రాకేశ్​, సోదరి రింకి, సోదరులు సునీల్​- అనిల్​లపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వికాస్​తో పాటు అతని తండ్రిని అరెస్ట్​ చేశారు. మిగిలిన వారు పారిపోయారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినిట్టు, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను వెంటనే అరెస్ట్​ చేసి, వారిని శిక్షించి, మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.