NLCIL Recruitment: డిగ్రీ అర్హతతో భారీగా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ ల భర్తీ
NLCIL Recruitment: గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌ఎల్‌సిఐఎల్ (NLCIL) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్ట్ లకు గేట్ 2023 స్కోర్ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది.
NLCIL Recruitment: ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ (NLCIL) గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఎన్‌ఎల్‌సి అధికారిక వెబ్‌సైట్ nlcindia.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 295 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
నవంబర్ 22 నుంచి
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్ లకు ఎన్ఎల్సీ అధికారిక వెబ్ సైట్ nlcindia.in ద్వారా నవంబర్ 22 నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 21. అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి గేట్ 2023 (GATE 2023) స్కోర్ ఆధారంగా ఈ పోస్ట్ లకు ఎంపిక చేస్తారు.
Vacancy Details: వేకెన్సీ వివరాలు..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 295 పోస్టులను భర్తీ చేయనున్నారు.
- మెకానికల్: 120 పోస్టులు
- ఎలక్ట్రికల్: 109 పోస్టులు
- సివిల్: 28 పోస్టులు
- మైనింగ్: 17 పోస్ట్లు
- కంప్యూటర్: 21 పోస్టులు
Eligibility: అర్హత, ఇతర వివరాలు
ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత డిసిప్లిన్ లో ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ గా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతల ఇతర వివరాలు, వయో పరిమితి గురించి అభ్యర్థులు వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి. Detailed Notification available here.
Selection: గేట్ స్కోర్
గేట్ 2023 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు గానూ, 80 మార్కులు గేట్ స్కోరుకు, 20 మార్కులు పర్సనల్ ఇంటర్వ్యూకు ఉంటాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 854 లను అప్లికేషన్ ఫీజుగా ఆన్ లైన్ లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీల వారు రూ. 354 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ-కలెక్ట్ ద్వారా www.onlinesbi.sbi లో ఈ ఫీజు చెల్లించాలి.