NIOS Class 10, 12 Exams: 10, 12 తరగతుల విద్యార్థులకు అలర్ట్; ఈ రోజే లాస్ట్ డేట్-nios class 10 12 exams 2023 last date to apply today direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Nios Class 10, 12 Exams 2023:last Date To Apply Today, Direct Link Here

NIOS Class 10, 12 Exams: 10, 12 తరగతుల విద్యార్థులకు అలర్ట్; ఈ రోజే లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 03:01 PM IST

NIOS Class 10, 12 Exams 2023: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (National Institute of Open Schooling NIOS ) లో 10వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2023 ఏప్రిల్, మే నెలల్లో జరిగే పరీక్షలకు రిజిస్టర్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ జనవరి 10వ తేదీ.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

NIOS Class 10, 12 Exams 2023: ఓపెన్ విద్యా విధానంలో భారత్ లో ప్రఖ్యాతి గాంచిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(National Institute of Open Schooling NIOS ) లో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు (Secondary and Senior Secondary exams) రాయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులు 2023 ఏప్రిల్, మే నెలల్లో జరిగే పరీక్షలకు రిజిస్టర్ చేసుకోవడానికి జనవరి 10 వ తేదీనే ఆఖరు తేదీ.

ట్రెండింగ్ వార్తలు

NIOS Class 10, 12 Exams 2023: ఆన్ లైన్ లో అప్లై

ఓపెన్ విద్యా విధానంలో భారత్ లో ప్రఖ్యాతి గాంచిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(National Institute of Open Schooling NIOS ) లో 10వ తరగతి, 12వ తరగతి (Secondary and Senior Secondary exams) పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. NIOS అధికారిక వెబ్ సైట్ sdmis.nios.ac.in లో రిజిస్టర్ చేసుకుని, 2023 ఏప్రిల్, మే నెలల్లో జరిగే పరీక్షలకు హాజరు కావచ్చు.

NIOS Class 10, 12 Exams 2023: ఎవరు అప్లై చేసుకోవచ్చు?

ఏప్రిల్ 2023 స్ట్రీమ్ 1, బ్లాక్ 1 కు ఎన్ రోల్ అయిన విద్యార్థులు, గత పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు, 2022 అక్టోబర్, నవంబర్ పరీక్షలకు రిజిస్టర్ చేసుకుని పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, లేదా హాజరై ఫెయిల్ అయిన విద్యార్థులు 2023 మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే 10వ తరగతి, 12వ తరగతి (Secondary and Senior Secondary exams) పరీక్షలకు 2023 ఏప్రిల్, మే నెలల్లో జరిగే 10వ తరగతి, 12వ తరగతి (Secondary and Senior Secondary exams) పరీక్షలకు రిజిస్టర్ చేసుకోవచ్చు.

NIOS Class 10, 12 Exams 2023: రిజిస్టర్ చేసుకోవడం ఎలా?

  • NIOS అధికారిక వెబ్ సైట్ sdmis.nios.ac.in ఓపెన్ చేయాలి.
  • లాగిన్ లింక్ ఓపెన్ చేసి, అవసరమైన డిటైల్స్ ఫిల్ చేసి, లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి, దరఖాస్తు ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తరువాత అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఒక కాపీని ప్రింట్ తీసి, భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.
  • ఒక్కో సబ్జెక్టుకు రూ. 250 ఫీజు ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షకు అదనంగా రూ. 120 చెల్లించాలి. పూర్తి వివరాలకు sdmis.nios.ac.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

Direct link to apply here 

IPL_Entry_Point

టాపిక్