NIFT admissions 2023: నిఫ్ట్‌లో యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు.. ప్రాసెస్ ఇలా
NIFT admissions 2023: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)లో యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
NIFT admissions 2023: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ) కేంద్రం జౌళి శాఖ పరిధిలో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన జాతీయస్థాయి ప్రాాధాన్యత గల విద్యా సంస్థ.
దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో నిఫ్ట్ విద్యా సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, డామన్, గాంధీనగర్, జోధ్‌పూర్, కాంగ్రా, కన్నూర్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, పాటా, పంచకుల, రాయబరేలి, షిల్లాంగ్, శ్రీనగర్ తదితర నగరాల్లో ఈ నిఫ్ట్ విద్యా సంస్థలు ఉన్నాయి.
ఆయా విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, డాక్టొరల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిఫ్ట్ ప్రారంభించింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 31వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సు ఉంది. ఇందులో యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, లెదర్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్ కోర్సులు ఉన్నాయి. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కింద అపరెల్ ప్రొడక్షన్ కోర్సు కూడా ఉంది.
పీజీ కోర్సుల్లో భాగంగా మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి.
ఆయా యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు ఫిబ్రవరి 5, 2023న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నిఫ్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. సీట్ల కేటాయింపు ప్రక్రియ మే-జూన్ 2003లో పూర్తవుతుంది.