నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎన్ఐసీఎల్ అధికారిక వెబ్ సైట్ nationalinsurance.nic.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమై నవంబర్ 11, 2024న ముగుస్తుంది. ముఖ్యమైన తేదీలు, అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను ఇక్కడ చూడండి.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎక్స్ఎస్ కేటగిరీ అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ ఛార్జీలుగా రూ.100, ఇతర అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ ఛార్జీలతో కలిపి అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి. డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించవచ్చు.