Toll fee hike: లోక్ సభ ఎన్నికల తరువాత టోల్ ఫీజుల పెంపు; అప్పటివరకు ఊరట
Toll fee hike: సాధారణంగా ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీన జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేలపై టోల్ ఫీజును నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) పెంచుతూ ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న కారణంగా జూన్ వరకు టోల్ ఫీజును పెంచకూడదని నిర్ణయించింది.
Lok Sabha polls: జూన్ 1వ తేదీ వరకు హైవేలు, ఎక్స్ ప్రెస్ హైవే లపై టోల్ చార్జీలు పాత రేట్లకే కొనసాగుతాయి. అప్పటివరకు వాహనదారులకు కొంతవరకు ఊరట లభిస్తుంది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఈ ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజులను పెంచకూడదని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కు ఎన్నికల సంఘం సూచించింది. దాంతో, జూన్ 1 వ తేదీన టోల్ ఫీజులను పెంచాలని ఎన్ హెచ్ ఏ ఐ నిర్ణయించింది. వార్షిక సవరణ తర్వాత ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సిన (NHAI) ప్రతిపాదిత టోల్ ఫీజు పెంపును (Toll fee hike) భారత ఎన్నికల సంఘం (ECI) అభ్యర్థన మేరకు నిలిపివేసింది. వాహనదారుల నుంచి పాత రేట్లకే టోల్ ఫీజు వసూలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలకు సమాచారం ఇచ్చింది.
లోక్ సభ ఎన్నికలు ముగిసేవరకు
లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు సవరించిన గతంలో వసూలు చేసిన టోల్ ఫీజు ((Toll fee) రేట్లనే కొనసాగించాలని ఈసీఐ సోమవారం ఎన్హెచ్ఏఐ (NHAI) ని కోరింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన ఎన్నికలు జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4 వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. జూన్ 1 వ తేదీ నుంచి కొత్త టోల్ రేట్లు (Toll rate hike) అమల్లోకి వస్తాయి. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంలో మార్పుల ఆధారంగా ఎన్హెచ్ఏఐ (NHAI) ప్రతి సంవత్సరం టోల్ ఫీజు రేట్లను సవరిస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఇది ఐదు శాతం పెరుగుతుందని అంచనా వేసింది. కొన్ని ఎక్స్ ప్రెస్ వే లకు కొత్త టోల్ ఫీజు (Toll fee) రేట్లను ఇప్పటికే వెల్లడించింది. జాతీయ రహదారులపై ఎన్హెచ్ఏఐ 855 టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. నేషనల్ హైవేస్ ఫీజు (రేట్లు, వసూళ్ల నిర్ధారణ) రూల్స్ 2008 ఆధారంగా వాహన యజమానుల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తోంది. ఎన్హెచ్ఏఐ (NHAI) 2022-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ ఫీజు ద్వారా రూ .54,000 కోట్లకు పైగా వసూలు చేసింది.