Honeymoon : హనీమూన్‌కు వెళ్లొచ్చిన నవ వధూవరులు.. భర్త నచ్చలేదని ప్రియుడి దగ్గరకు భార్య-newly married couple went to honeymoon then after 2 months of marriage the bride said i dint like my husband ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Honeymoon : హనీమూన్‌కు వెళ్లొచ్చిన నవ వధూవరులు.. భర్త నచ్చలేదని ప్రియుడి దగ్గరకు భార్య

Honeymoon : హనీమూన్‌కు వెళ్లొచ్చిన నవ వధూవరులు.. భర్త నచ్చలేదని ప్రియుడి దగ్గరకు భార్య

Anand Sai HT Telugu

Honeymoon : ప్రేమికుల కోసం భర్తలను చంపడం, భర్తలను వదిలేయడం వంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఓ షాకింగ్ సంఘటనే జరిగింది. కొత్తగా పెళ్లయిన ఓ మహిళ పెళ్లి చేసుకుని హనీమూన్ హ్యాపీగా గడిపింది. తిరికి వచ్చిన తర్వాత భర్తను విడిచిపెట్టి స్వగ్రామం చేరింది.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

కొందరు వివాహితలు తమ ప్రేమికుల కోసం భర్తలను వదిలేసే ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇలాంటి షాకింగ్ కేసులు రోజుకొకటి కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ నవ వధువు తన ప్రేమికుడి కోసం భర్తను విడిచిపెట్టింది. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహమైంది. భర్తతో హనీమూన్‌ని సంతోషంగా ముగించుకుంది. అయితే ప్రేమికుడిని విడిచిపెట్టలేని నవ వధువు ఇప్పుడు భర్తను వదిలి పుట్టింటికి చేరింది.

ఈ షాకింగ్ సంఘటన ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో జరిగింది. హనీమూన్ తర్వాత తనకు భర్త వద్దంటూ కొత్తగా పెళ్లయిన మహిళ తన ఇంటికి వచ్చింది. నా భర్త అంటే ఇష్టం లేదు, నేను నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జీవించాలనుకుంటున్నాను అని తల్లిదండ్రులకు చెప్పింది. కుమార్తె మాటలకు తల్లిదండ్రులు షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో గరుడ్ తహసీల్‌కు చెందిన యువకుడితో రెండు నెలల కిందట ఓ అమ్మాయికి వివాహమైంది. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. తన భర్తతో కలిసి హనీమూన్‌ను సంతోషంగా ముగించుకుంది. అయితే అకస్మాత్తుగా ఆమె తన స్వగ్రామానికి తిరిగి వచ్చింది. చాలా రోజులుగా మహిళ తన భర్త ఇంటికి వెళ్లకపోవడాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించారు. నా భర్త అంటే ఇష్టం లేదని, నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జీవించాలనుకుంటున్నానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

కూతురి మాటలు విని తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. కుటుంబసభ్యులు కుమార్తెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మొదట ఆమె తమాషా చేస్తుందని తల్లిదండ్రులు భావించారు. అయితే పెళ్లికూతురు దృఢంగా ఉండటంతో విషయంపై క్లారిటీ వచ్చింది.

ఇలా చేయొద్దని తల్లిదండ్రులు చెప్పారు. రెండు ఇళ్ల గౌరవం పోతుందన్నారు. మీ భర్త లేదా అత్తమామలు ఏదైనా తప్పు చేశారా? అని అడిగారు. వాళ్లంతా చాలా మంచివాళ్లు. నేను నా భర్తను ప్రేమించలేదని అమ్మాయి చెప్పుకొచ్చింది. 'నేను నా ప్రియుడిని ప్రేమిస్తున్నాను. పెళ్లికి ముందు మా మధ్య ఎఫైర్ ఉంది. మీరు ఈ సంబంధానికి అంగీకరించరని నాకు తెలుసు. అందుకే మీ కోరిక మేరకే వేరే చోట పెళ్లి చేసుకున్నాను. కానీ నేను నా భర్తతో ఎప్పుడూ ప్రేమలో పడలేదు. నేను నా ప్రియుడితో ఉండాలనుకుంటున్నాను.' అని యువతి తెలిపింది.

ఆ తర్వాత వధువు నేరుగా తన ప్రేమికుడి ఇంటికి వెళ్లింది. ఈ వార్త పెళ్లికూతురు అత్తమామలకు కూడా చేరింది. ఈ విషయం పోలీసులకు చేరడంతో వధువు తరపువారు ఆమె అత్తమామలకు సంబంధించిన అన్ని వస్తువులను తిరిగి ఇవ్వాలని, వివాహ ఖర్చులను తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. అనంతరం పెళ్లికూతురు తన ప్రేమికుడి ఇంటికి వెళ్లింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెబుతున్నారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.