Comet C/2022 E3 ZTF: మళ్లీ అనుకోని అతిథి పలకరించబోతోంది.. సిద్ధం కండి-newly found comet to visit earth is visible in the second week of february ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Newly Found Comet To Visit Earth, Is Visible In The Second Week Of February

Comet C/2022 E3 ZTF: మళ్లీ అనుకోని అతిథి పలకరించబోతోంది.. సిద్ధం కండి

Sudarshan Vaddanam HT Telugu
Jan 03, 2023 03:37 PM IST

Comet C/2022 E3 ZTF: శాస్త్రాన్వేషకులకు, అంతరిక్ష రహస్యాలను చేధించాలనుకునేవారికి, భూమిపై జీవం పుట్టుకపై పరిశోధనలు చేస్తున్నవారికి ఇదొక అద్భుతమైన అవకాశం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Comet C/2022 E3 ZTF: మరి కొన్ని రోజుల్లో అనుకోని అతిథి మనలను పలకరించబోతోంది. ఎన్నో రహస్యాలను తనతో పాటు తీసుకువస్తోంది. ఆ అతిథి కోసం చాలామంది ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

After 50K years: 50 వేల సంవత్సరాల తరువాత..

ఈ అతిధి మనల్ని పలుకరిస్తోంది దాదాపు 50 వేల సంవత్సరాల తరువాత. అప్పుడు వచ్చినప్పుడు భూమిపై కొత్త రాతి యుగం నడుస్తోంది. నియాండర్తల్స్ భూమిపై నడయాడుతున్నారు. ఆధునిక సాంకేతిక యుగం నడుస్తున్న సమయంలో, రోబోలు భూమిపై నడయాడుతున్న సమయంలో ఇప్పుడు మళ్లీ వస్తోంది.

Comet C/2022 E3 ZTF: తోకచుక్క సీ 2022 ఈ3(జడ్ టీ ఎఫ్)

భూమిని ఇప్పుడు పలకరించబోతోంది సీ 2022 ఈ3(జడ్ టీ ఎఫ్) (Comet C/2022 E3 ZTF) అనే తోకచుక్క (comet). దీని పరిభ్రమణ కాలం సుమారు 50 వేల సంవత్సరాలు. సౌర వ్యవస్థలోకి ప్రవేశించి, సుమారు ఫిబ్రవరి 12న భూమి కి అత్యంత దగ్గరగా రాబోతోంది. ఈ తోకచుక్క (comet) ను మొదట గత సంవత్సరం మార్చి నెలలో జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ సెంటర్(Zwicky Transient Facility) గుర్తించారు. తోకభాగం మంచుతో కప్పబడి ఉండడంతో మొదట దీనిని గ్రహ శకలంగా భావించారు. సూర్యడి వేడి ప్రభావంతో మంచు కరగడం ప్రారంభమైన తరువాత తోక భాగం కనిపించింది. దాంతో, తోక చుక్క (comet) గా నిర్ధారించారు. పూర్తిగా ఆర్గానిక్ మేటర్ తో ఈ తోకచుక్క (comet) నిండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Comet C/2022 E3 ZTF: చాలా రహస్యాలు..

ఈ తోకచుక్క(comet) ను లోతుగా పరిశీలించడం ద్వారా మన సౌర వ్యవస్థ గురించి, భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి మరిన్ని రహస్యాలు తెలుస్తాయని భావిస్తున్నారు. చాలా తోకచుక్కలు కూడా మంచుతో కప్పబడి ఉన్న సేంద్రీయ పదార్ధం(organic matter)తో నిండి ఉంటాయని నాసా(Nasa) తెలిపింది. జీవం పుట్టుకకు అవసరమైన నీరు(water), సేంద్రీయ పదార్ధం (organic matter) భూమిపైకి రావడానికి కారణం తోకచుక్కలే (comet) అన్న వాదనను చాలామంది శాస్త్రవేత్తలు సమర్ధిస్తారు.

How to watch Comet C/2022 E3 ZTF: ఎలా చూడొచ్చు..

భూమికి దగ్గరగా వచ్చిన తరువాత ఈ తోక చుక్క (comet) ను బైనాక్యులర్స్ తో చూడవచ్చని, మరింత దగ్గరగా వచ్చినప్పుడు బాగా చీకటిగా ఉన్న సమయంలో సాధారణ కంటితో కూడా చూడగలమని చెబుతున్నారు. ఆకాశంతో అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఇది కనిపిస్తుందని వివరిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్