Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్‌లో మళ్లీ వైల్డ్‌ఫైర్.. ఇళ్లు ఖాళీ చేయాలని వేలాది మందికి ఆదేశాలు
Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్‌లో కొత్తగా కార్చిచ్చు మెుదలైంది. ఆ తర్వాత సుమారు 50,000 మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. దాదాపు 8 వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు ఉత్తరాన కొత్తగా వైల్డ్ ఫైర్ మెుదలైంది. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. రెండు ఘోరమైన అగ్నిప్రమాదాల తర్వాత ఈ ప్రాంతం ఇప్పటికే సంక్షోభంలో ఉంది. బుధవారం కాస్టాటిక్ సరస్సు సమీపంలోని కొండలలో మంటలు వ్యాపించాయి. ఇది కొన్ని గంటల్లో 9400 ఎకరాలకు వ్యాపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో బలమైన గాలులు వీయడంతో మంటలు ఎక్కువ దూరం వెళ్లాయి. మరింతగా వ్యాపించే అవకాశం ఉంది.

మంటలు చెలరేగే అవకాశం ఉన్నందున సరస్సు చుట్టూ ఉన్న 50,000 మందిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. లాస్ ఏంజిల్స్‌కు ఉత్తరాన 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం శాంటా క్లారిటా నగరానికి సమీపంలో ఉంది. కొత్త అగ్నిప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలోని నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయమని తెలియజేసేందుకు ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చారు. మా ఇళ్లు కాలిపోకూడదని ప్రార్థిస్తున్నామి ప్రజలు వేడుకున్నారు.
గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఇప్పటికీ రెండు భారీ అగ్నిప్రమాదాల కారణంగా 20 మందికి పైగా మరణించారు వేలాది భవనాలను పాడైపోయాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రాబర్ట్ జెన్‌సన్ కొత్త అగ్నిప్రమాదానికి గురైన ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ వెంటనే ఖాళీ చేయాలని కోరారు. ఆర్డర్ విన్న వెంటనే దయచేసి బయటకు వెళ్లండని కోరారు.
మరోవైపు కోస్టిక్‌లోని ఒక జైలును కూడా ఖాళీ చేయమని ఆదేశాలు వచ్చాయి. దీంతో సుమారు 500 మంది ఖైదీలను మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇతర జైళ్లలో దాదాపు 4,600 మంది ఖైదీలు ఉన్నారని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా తెలిపారు. బస్సులు అందుబాటులో ఉన్నాయి, పరిస్థితి మారితే వారిని కూడా తరలించే అవకాశం ఉంది.