New Parliament building : నూతన పార్లమెంట్ భవనంలో కార్యకలాపాలు షురూ..!
New Parliament building : నూతన పార్లమెంట్ భవనంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎంపీల ఫొటో సెషన్ జరిగింది.
New Parliament building : దేశ చరిత్రలో మరో కీలక పరిణామం! నూతన పార్లమెంట్ భవనంలో మంగళవారం ఉదయం కార్యకలాపాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇక ఇక్కడే జరగనున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఫొటో సెషన్‌తో మొదలు..
పార్లమెంట్ స్పెషల్ సెషన్ సోమవారం ఉదయం పాత భవనంలో ప్రారంభమైంది. పాత పార్లమెంట్ భవనంతో తనకు ఉన్న బంధాన్ని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక మంగళవారం ఉదయం.. లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపై కార్యకలాపాలన్నీ నూతన పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయని ఆ ప్రకటన స్పష్టం చేసింది.
Parliament special session : మరోవైపు మంగళవారం ఉదయం 10గంటల ప్రాంతంలో నూతన పార్లమెంట్ భవనం వద్దకు వెళ్లారు ప్రధాని మోదీ. అనంతరం జరిగిన ఫొటో సెషన్లో ఎంపీలందరితో కలిసి ఫొటో దిగారు.
అయితే.. ఈ ఫొటో సెషన్ మధ్యలో బీజేపీ ఎంపీ నర్హరి అమిన్ స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ ఉన్నా వారు ఆయనకు మంచి నీరు అందించారు. కొద్దిసేపటి తర్వాత.. ఆయన తిరిగి లేచి, ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
ఫొటో సెషన్ అనంతరం పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో మోదీతో పాటు అనేక మంది ఎంపీలు పాల్గొన్నారు. దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు మోదీ.
అనంతరం పార్లమెంట్ పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మోదీతో పాటు ఎంపీలందరు కలిసి నడిచి వెళ్లారు. అయితే.. మోదీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పార్లమెంట్‌లోకి ప్రవేశిస్తారని తొలుత సమాచారం వచ్చింది. అయితే.. లీడర్ ఆఫ్ అపోజీషన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి.. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నూతన భవనంలోకి వెళ్లారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు అధీర్ వెనుక నడిచారు.
లోక్‌సభ ముందుకు కీలక బిల్లు..!
Women's reservation bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబిన్ సోమవారం రాత్రి ఆమోద ముద్ర వేసింది. ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ఈ బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకు వస్తుందని తెలుస్తోంది. ఈ అంశంపై బుధవారం సభలో చర్చ జరగొచ్చు. ఈ నెల 21 రాజ్యసభలో ఈ విషయంపై చర్చ ఉంటుందని తెలుస్తోంది.
కొత్త డ్రెస్ కోడ్..
ఇక పార్లమెంట్లో పని చేసే సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ వచ్చింది. మార్షల్స్, సెక్యూరిటీ స్టాఫ్, అధికారులు, ఛాంబర్ అటెండెంట్స్లు కొత్త రంగు దుస్తుల్లోనే పనులు చేయడం మొదలుపెట్టారు.
సంబంధిత కథనం