Cancer news: మిరాకిల్ బ్లడ్ టెస్ట్.. లక్షణాల్లేని కేన్సర్ ను కూడా గుర్తిస్తుంది-new blood test detects multiple cancers without symptoms confirms a study ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  New Blood Test Detects Multiple Cancers Without Symptoms, Confirms A Study

Cancer news: మిరాకిల్ బ్లడ్ టెస్ట్.. లక్షణాల్లేని కేన్సర్ ను కూడా గుర్తిస్తుంది

HT Telugu Desk HT Telugu
Sep 13, 2022 10:03 PM IST

New blood test detects multiple cancers without symptoms | చిన్న రక్త పరీక్షతో ఇప్పటి వరకు లక్షణాలు బయటపడని కేన్సర్ ను గుర్తించవచ్చు.ఈ Multi-Cancer Early Detection (MCED) పరీక్ష ద్వారా ఇప్పటికే లక్షణలు బయటపడిన కేన్సర్లతో పాటు, శరీరంలో అంతర్గతంగా ప్రారంభమై, ఇంకా లక్షణాలు బహిర్గతం కాని కేన్సర్లను కూడా గుర్తించవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

New blood test detects multiple cancers without symptoms కేన్సర్ స్క్రీనింగ్ లో ఇదో మిరాకిల్ బ్లడ్ టెస్ట్ గా భావిస్తున్నారు. చాలామందికి ఎర్లీ స్టేజెస్ లో కేన్సర్ బయటపడదు. ఫైనల్ స్టేజెస్ వరకు లక్షణాలు కనపడకపోవడం వల్ల చికిత్స కష్టమవుతోంది. ఈ Multi-Cancer Early Detection (MCED) పరీక్షతో ఆ సమస్య పరిష్కారమవుంది. చిన్న రక్త పరీక్షతో కేన్సర్ ను ముందే గుర్తించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

New blood test detects multiple cancers without symptoms; పాథ్ ఫైండర్ స్టడీ

కేన్సర్ స్క్రీనింగ్ పై పరిశోధనలు చేసే హెల్త్ కేర్ సంస్థ ‘గ్రెయిల్(GRAIL)’ ఒక అధ్యయనం జరిపింది. 50 ఏళ్లు పైబడిన 6,692 మందికి ఈ Multi-Cancer Early Detection (MCED) రక్త పరీక్ష నిర్వహించింది. వారిలో దాదాపు ఒక శాతం మందిలో కేన్సర్ ఉన్నట్లు గుర్తించింది. 92 మందిలో లక్షణాలు బయటపడని కేన్సర్ లను గుర్తించింది. ఈ అధ్యయనం ఫలితాలను European Society for Medical Oncology (ESMO) కాంగ్రెస్ లో వెల్లడించారు. ఈ సదస్సు ఈ సంవత్సరం పారిస్ లో జరిగింది. గతంలో ఉన్న MCED రక్త పరీక్ష విధానాన్ని మరింత ఆధునీకరించడం వల్ల నిద్రాణంగా ఉన్న కేన్సర్ కణాలను కూడా గుర్తించగలిగారని గ్రెయిల్ ఒక ప్రకటనలో వివరించింది. అలాగే, స్టేజ్ 1లో ఉన్న లివర్, చిన్న ప్రేవు, గర్భాశయం కేన్సర్లను, స్టేజ్ 2లో ఉన్న క్లోమం, వెన్నెముక కేన్సర్లను ఈ అధ్యయనంలో గుర్తించామని వెల్లడించింది. ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

IPL_Entry_Point