New Aadhar app: పౌరుల డేటా భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను రూపొందించింది. ఈ కొత్త ఆధార్ యాప్ ఫేస్ ఐడీ, క్యూఆర్ స్కానింగ్ ఉపయోగించి సురక్షిత డిజిటల్ ధృవీకరణకు వీలు కల్పిస్తుంది. ఫిజికల్ గా ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. పౌరుల గోప్యత, నియంత్రణలను మెరుగుపరుస్తుంది. ఇది వినియోగదారులు ఆధార్ కార్డుల ఒరిజినల్స్ లేదా ఫోటోకాపీలు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఆధార్ వివరాలను డిజిటల్‌గా ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ కొత్త ఆధార్ యాప్ వివరాలను కేంద్ర సమాచార మరియు సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్, Xలో షేర్ చేసిన వీడియో ద్వారా వెల్లడించారు. ఫేస్ ఐడీ ద్వారా నిర్ధారణ, వినియోగదారు సమ్మతితో డేటాను సురక్షితంగా పంచుకునే సామర్థ్యం వంటి లక్షణాలు ఈ యాప్ లో ఉన్నాయి. ఈ యాప్ ప్రస్తుతం బీటా పరీక్ష దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ యాప్, ఆధార్ ధృవీకరణను సరళీకృతం చేయడం, ఆధార్ దుర్వినియోగం నుండి రక్షణ కల్పించడం.. వంటి వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
సంబంధిత కథనం