Netaji statue Sourced from Telangana quarry: అది మన ఖమ్మం గ్రానైటే..!-netaji statue sourced from t gana quarry makeshift road was built to transport the giant stone ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Netaji Statue: Sourced From T'gana Quarry; Makeshift Road Was Built To Transport The Giant Stone

Netaji statue Sourced from Telangana quarry: అది మన ఖమ్మం గ్రానైటే..!

Sudarshan Vaddanam HT Telugu
Sep 08, 2022 10:10 PM IST

Netaji statue Sourced from Telangana quarry: ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భారీ గ్రానైట్ విగ్రహాన్ని ప్రధాని మోదీ గురువారం ఆవిష్కరించారు. అయితే, ఆ భారీ గ్రానైట్ రాయిని తీసుకువచ్చింది తెలంగాణలోని ఖమ్మంలో ఉన్న క్వారీ నుంచే కావడం విశేషం.

ప్రధాని మోదీ ఆవిష్కరించిన నేతాజీ విగ్రహం
ప్రధాని మోదీ ఆవిష్కరించిన నేతాజీ విగ్రహం

Netaji statue Sourced from Telangana quarry: ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తు, 65 మెట్రిక్ టన్నుల బరువున్న భారీ గ్రానైట్ నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ 65 మెట్రిక్ టన్నుల విగ్రహాన్ని రూపొందించడం కోసం 280 మెట్రిక్ టన్నుల బరువైన ఏకశిలా గ్రానైట్ ను ఖమ్మంలోని ఒక క్వారీ నుంచి తీసుకువచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Netaji statue Sourced from Telangana quarry: ఎలా తీసుకువచ్చారు?

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక క్వారీ లో ఈ విగ్రహం రూపొందించడానికి అనువైన భారీ గ్రానైట్ ను గుర్తించారు. 280 మెట్రిక్ టన్నుల బరువున్న ఆ గ్రానైట్ రాయిని ఖమ్మంలోని ఆ క్వారీ నుంచి ఢిల్లీ లోని National Gallery of Modern Art (NGMA) కు తరలించడం అసాధ్యమని మొదట భావించారు. కానీ, పట్టుదలతో, తీవ్రంగా శ్రమించి ఆ అసాధ్యాన్ని సాధ్యం చేశారు. అందుకు 100 అడుగుల పొడవైన ట్రక్ ను తీసుకువచ్చారు. దానికి 140 చక్రాలు, 14 యాక్సిల్స్ ఉన్నాయి.

Netaji statue Sourced from Telangana quarry: 1665 కిలోమీటర్లు..

ఖమ్మంలోని ఆ క్వారీ నుంచి దగ్గర్లోని జాతీయ రహదారికి పక్కా రోడ్డు లేదు. అందువల్ల మొదట జాతీయ రహదారి వరకు ఒక రోడ్డును నిర్మించారు. అయినా, ఆ రోడ్డులో వెళ్తండగా ఆ ట్రక్ 42 టైర్లు పగిలి పోయాయి. వాటిని మార్చి మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఐదు రాష్ట్రాల గూండా 1665 కిలో మీటర్లు ప్రయాణించి సురక్షితంగా ఆ ట్రక్ గమ్యం చేరుకుంది.

Netaji statue Sourced from Telangana quarry: ఏ మార్గంలో..

మొదట మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు, అక్కడి నుంచి మధ్య ప్రదేశ్ ద్వారా ఉత్తర ప్రదేశ్ కు, అక్కడి నుంచి హరియాణా ద్వారా ఢిల్లీకి ఆ ట్రక్ ను చేర్చారు. మే 22 న ప్రారంభమైన ఆ ప్రయాణం జూన్ 2 న ముగిసింది.

Netaji statue Sourced from Telangana quarry: అరుణ్ యోగిరాజ్ టీమ్

అనంతరం, ఆ గ్రానైట్ నుంచి అద్భుతమైన నేతాజీ విగ్రహాన్ని రూపొందించే కార్యక్రమాన్ని శిల్పి అరుణ్ యోగిరాజ్ టీమ్ చేపట్టింది. వారు దాదాపు 26 వేల పని గంటల పాటు శ్రమించి 65 మెట్రిక్ టన్నుల బరువు, 28 అడుగుల ఎత్తైన నేతాజీ విగ్రహాన్ని రూపొందించారు.

WhatsApp channel