NEET UG 2024: నీట్ యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..-neet ug 2024 round 2 seat allotment result out at mccnicin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug 2024: నీట్ యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

NEET UG 2024: నీట్ యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu
Sep 20, 2024 02:49 PM IST

నీట్ యూజీ 2024 రెండవ రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడయ్యాయి. నీట్ యూజీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎంసీసీ అధికారిక వెబ్ సైట్ mcc.nic.in లో తమకు సీట్ కేటాయించారా? లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవచ్చు.

నీట్ యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి
నీట్ యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి (Bachchan Kumar/Hindustan Times/For representation only)

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, ఎంసీసీ నీట్ యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాలను తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. పరీక్షకు హాజరై రౌండ్ 2 కౌన్సెలింగ్ కు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్ సైట్ mcc.nic.in ను సందర్శించి సీట్ల కేటాయింపు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ప్రొవిజినల్ రిజల్ట్స్

నీట్ యూజీ 2024 (neet ug) రౌండ్ 2 సీట్ల కేటాయింపునకు సంబంధించి ఇవి తాత్కాలిక ఫలితాలని, మార్పుకు లోబడి ఉంటాయని అభ్యర్థులకు తెలియజేశారు. ప్రొవిజనల్ రిజల్ట్ లో కేటాయించిన సీటుపై అభ్యర్థులు ఎలాంటి హక్కును క్లెయిమ్ చేయలేరని, నీట్ (neet) యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపు ప్రొవిజనల్ రిజల్ట్ ను కోర్టులో సవాలు చేయలేమని తెలిపారు. ఎంసీసీ వెబ్సైట్ నుంచి కేటాయింపు లేఖను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాతే అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాల/ఇన్స్టిట్యూట్ను సంప్రదించాలని సూచించింది.

తేడాలుంటే మెయిల్ చేయండి..

ఫలితాల్లో ఏదైనా తేడా ఉంటే, అభ్యర్థులు వెంటనే mccresultquery@gmail.com ఇమెయిల్ ద్వారా డిజిహెచ్ఎస్ ఎంసిసికి తెలియజేయవచ్చు. రౌండ్ 2 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 సెప్టెంబర్ 13న ప్రారంభమై 2024 సెప్టెంబర్ 16న ముగిసింది. 2024 సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ సదుపాయం కల్పించారు.

నీట్ యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపును ఎలా చెక్ చేయాలి

  • ముందుగా ఎంసీసీ అధికారిక వెబ్సైట్ mcc.nic.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న నీట్ యూజీ 2024 రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • మీ సీటు కేటాయింపు ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • సీటు కేటాయింపు ఫలితాన్ని చెక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.