NEET UG 2024 retest result : నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..-neet ug 2024 retest result out for 1 563 candidates see how to check marks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug 2024 Retest Result : నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

NEET UG 2024 retest result : నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Published Jul 01, 2024 08:27 AM IST

NEET UG 2024 retest : గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ సమస్యల కారణంగా 1,563 మంది అభ్యర్థులకు నీట్-యూజీ 2024 రీటెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల..
నీట్​ యూజీ రీటెస్ట్​ ఫలితాలు విడుదల..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ) 2024 రీటెస్ట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 30న విడుదల చేసింది. ఇది “గ్రేస్ మార్కులు”, "పేపర్ లీక్" సమస్యల తరువాత 1,563 మంది అభ్యర్థులకు మాత్రమే నిర్వహించిన పరీక్ష అన్న విషయం తెలిసిందే. నీట్ యూజీ 2024 రీటెస్ట్​కు హాజరైన విద్యార్థులు తమ మార్కులను ఎన్టీఏ అధికారిక exams.nta.ac.in/NEET/ వెబ్​సైట్​లో చూసుకోవచ్చు.

నీట్ యూజీ పరీక్షలో గతంలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు 'సమయం వృథా' కారణంగా ఎన్టీఏ జూన్ 23న రీ-ఎగ్జామినేషన్ నిర్వహించింది. తరువాత సుప్రీంకోర్టు దానిని రద్దు చేసింది. అభ్యర్థులకు గ్రేస్ మార్కులను మినహాయించి తిరిగి పరీక్షను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.

నీట్ యూజీ 2024 రీ ఎగ్జామ్ ఫలితాలు: స్కోర్​కార్డ్​ని ఇలా డౌన్​లోడ్ చేసుకోండి..

స్టెప్​ 1: exams.nta.ac.in/NEET నీట్ యూజీ 2024 అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండి. 

స్టెప్ 2: హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ 2024' ట్యాబ్​ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ వంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండి.

స్టెప్ 4: కొత్త విండో ఓపెన్ అవుతుంది, స్కోర్ కార్డ్ స్క్రీన్​పై కనిపిస్తుంది.

దశ 5: మీ స్కోర్​ని చెక్​ చేసుకుని స్కోర్​కార్డ్​ని డౌన్​లోడ్ చేసుకోండి.

స్టెప్ 6: భవిష్యత్తు రిఫరెన్స్ కోసం నీట్ యూజీ 2024 స్కోర్​కార్డ్​ని ప్రింట్ తీసుకోండి.

అభ్యర్థులు తమ స్కోర్​కార్డులో తమ ఫోటో, బార్కోడ్ ఉండేలా చూసుకోవాలి. మిస్ అయితే మళ్లీ డౌన్​లోడ్ చేసుకోవాలి. 1,563 మంది అభ్యర్థులకు గాను 813 మంది మాత్రమే నీట్​ యూజీ రీ ఎగ్జామ్ రాశారు. మిగిలిన 48 శాతం మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు మినహాయించి ఒరిజినల్ స్కోర్లను ఎంచుకున్నారు.

హరియాణా ఝజ్జర్​ కేంద్రం నీట్​ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది. ఇక్కడ మొదట పరీక్ష రాసిన 494 మంది అభ్యర్థుల్లో 287 మంది రీటెస్ట్​ తీసుకున్నారు. ఇది 58శాతం.

నీట్​ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాల అనంతరం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) జూలై 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది.

నీట్ యూజీ 2024పై వివాదం..

నీట్ యూజీ ఎగ్జామ్ 2024 మే 5న జరగ్గా, 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. 2024 జూన్ 4న ఎన్టీఏ ఫలితాలను ప్రకటించగా, 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించారు.

67 మంది పర్ఫెక్ట్ స్కోరర్లలో ఆరుగురు హరియాణాలోని ఝజ్జర్ కేంద్రానికి చెందినవారే కావడం అనుమానాలకు తావిస్తోంది. పేపర్ లీకేజీలు, ఇతర అవకతవకల కారణంగా నీట్-యూజీ 2024 పరిశీలనలో ఉంది. సమీక్ష అనంతరం సమగ్ర దర్యాప్తు కోసం విద్యాశాఖ ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ గుజరాత్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోద్రా జిల్లాల్లోని అనుమానితుల పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.