NEET UG 2024 Counselling : నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం ఈ వెబ్‌సైట్లు ఫాలో అవ్వండి
NEET UG 2024 Counselling Date : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూలై 1వ తేదీన NEET UG 2024 రీటెస్ట్ ఫలితాలను ప్రకటించింది. అయితే కౌన్సెలింగ్‌పై చాలా మందికి గందరగోళం ఉంది.

జూలై 1వ తేదీన నీట్ యూజీ రీటెస్ట్ ఫలితాలు వెలువరించారు. ఇది ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ - https://exams.nta.ac.in/NEET/లో అందుబాటులో ఉంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC).., MBBS, BDS, BSc నర్సింగ్ సీట్లను కేటాయించే బాధ్యతను కలిగి ఉంటుంది. జూలై 6 NEET UG 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించాలని భావిస్తున్నారు.
ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. జూలై 6 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. mcc.nic.inలో దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, షెడ్యూలు రావాల్సి ఉంది.
జూన్ 23న నిర్వహిస్తామని, జూలై 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు జూన్ 30లోగా ఫలితాలను ప్రకటిస్తామని ఎన్టీఏ గతంలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. అయితే నీట్ యూజీ రీటెస్ట్ ఫలితాలను జులై 1న ప్రకటించేశారు.
కొన్ని కారణాల వల్ల 1563 మంది అభ్యర్థులకు జూన్ 23న నీట్ రీ టెస్ట్ నిర్వహించారు. మొత్తం 1563 మంది అర్హులకు గాను 813 మంది రీ టెస్ట్ కు హాజరయ్యారు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024 షెడ్యూల్ ఎలా చెక్ చేయాలి?
mcc.nic.in అధికారిక వెబ్‌సైట్ వెళ్ళండి.
యూజీ కౌన్సెలింగ్ పేజీని ఓపెన్ చేయండి.
'ఈ సర్వీసెస్/షెడ్యూల్' ట్యాబ్ కింద ఇచ్చిన నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఓపెన్ చేయండి.
ఇప్పుడు ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోండి.
మీ లాగిన్ వివరాలను పొందడానికి రిజిస్టర్ చేసుకోండి.
ఆ తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి పేమెంట్ చేయాలి.
మీ ఫారమ్ సబ్మిట్ చేయండి.
రాష్ట్ర కోటా సీట్లకు సంబంధిత రాష్ట్ర అధికారులు ఆన్ లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వెబ్ సైట్ల జాబితాను ఇక్కడ చూడొచ్చు..
ఆంధ్రప్రదేశ్: ntruhs.ap.nic.in
అస్సాం: dme.assam.gov.in
అరుణాచల్ ప్రదేశ్: apdhte.nic.in
బీహార్: bceceboard.bihar.gov.in
చండీగఢ్: gmch.gov.in
గోవా: dte.goa.gov.in
ఛత్తీస్‌గఢ్: cgdme.in
గుజరాత్: medadmgujarat.org
హర్యానా: dmer.haryana.gov.in
జమ్మూ మరియు కాశ్మీర్: jkbopee.gov.in
జార్ఖండ్: jceceb.jharkhand.gov.in
కేరళ: cee.kerala.gov.in
కర్ణాటక: kea.kar.nic.in
మధ్యప్రదేశ్: dme.mponline.gov.in
మహారాష్ట్ర: cetcell.mahacet.org
మేఘాలయ: meghealth.gov.in
మణిపూర్: manipurhealthdirectorate.mn.gov.in
మిజోరం: mc.mizoram.gov.in
నాగాలాండ్: dtenagaland.org.in
ఒడిశా: ojee.nic.in
పుదుచ్చేరి: centacpuducherry.in
పంజాబ్: bfuhs.ac.in
తమిళనాడు: tnmedicalselection.net
తెలంగాణ : www.knruhs.telangana.gov.in
త్రిపుర: dme.tripura.gov.in
ఉత్తరాఖండ్: hnbumu.ac.in
ఉత్తరప్రదేశ్: upneet.gov.in
పశ్చిమ బెంగాల్: wbmcc.nic.in
ఇతర వెబ్‌సైట్‌లు
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC): nmc.org.in
డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI): dciindia.gov.in
డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS): dghs.gov.in.