NEET UG 2023 Result Live : నీట్​ యూజీ పరీక్ష ఫలితాలు విడుదల.. టాపర్ తెలుగు వాడే..-neet ug 2023 result live direct link nta score card and other details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug 2023 Result Live : నీట్​ యూజీ పరీక్ష ఫలితాలు విడుదల.. టాపర్ తెలుగు వాడే..

నేడు నీట్​ యూజీ పరీక్ష ఫలితాలు విడుదల!(Hindustan Times)

NEET UG 2023 Result Live : నీట్​ యూజీ పరీక్ష ఫలితాలు విడుదల.. టాపర్ తెలుగు వాడే..

06:20 PM ISTJun 13, 2023 10:25 PM Sharath Chitturi
  • Share on Facebook
06:20 PM IST

  • NEET UG 2023 Result Live : 2023 నీట్​ యూజీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ బ్లాగ్​ను ఫాలో అవ్వండి.

Tue, 13 Jun 202304:55 PM IST

వివిధ కేటగిరీల్లో కటాఫ్ మార్క్స్ ఇవే..

నీట్ యూజీ 2023 లో అన్ని కేటగిరీల కటాఫ్ మార్క్స్ పెరిగాయి. ఆ వివరాలు..

  • అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ - 720 - 137 మార్క్స్ (50 పర్సంటైల్)
  • ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ - 136- 107మార్క్స్ (40 పర్సంటైల్)
  • అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ + పీహెచ్ కేటగిరీ - 136- 121మార్క్స్ (45 పర్సంటైల్)
  • ఓబీసీ, ఎస్సీ + పీహెచ్ కేటగిరీ - 120-107 (40 పర్సంటైల్)
  • ఎస్టీ + పీహెచ్ కేటగిరీ - 120-108 (40 పర్సంటైల్)

Tue, 13 Jun 202304:42 PM IST

నీట్ యూజీ 2023.. టాప్ 20 ర్యాంకర్స్ వీరే..

నీట్ యూజీ 2023 లో మొదటి ర్యాంకును సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన జే ప్రభంజన్ సాధించారు. మూడవ ర్యాంక్ ను 716 మార్కులతో కౌస్తబ్ బౌరి సాధించాడు. కాగా, నాలుగవ ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకు సాధించిన విద్యార్థులు అందరూ పొందిన మార్కులు 715 కావడం విశేషం. అంటే, దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు 715 మార్కులు సాధించారు. టాప్ 20 లో కౌస్తబ్ బౌరి (3వ ర్యాంక్, 716 మార్క్స్), ప్రాంజల్ అగర్వాల్ (4వ ర్యాంక్, 715 మార్క్స్), ధ్రువ్ అద్వానీ (5వ ర్యాంక్, 715 మార్క్స్), సూర్య సిద్ధార్థ్ (6వ ర్యాంక్, 715 మార్క్స్), శ్రీనికేత్ రవి(7వ ర్యాంక్, 715 మార్క్స్) స్వయం శక్తి త్రిపాఠీ (8వ ర్యాంక్, 715 మార్క్స్), ఎస్ వరుణ్ (9వ ర్యాంక్, 715 మార్క్స్), పార్థ్ ఖండేల్వాల్ (10వ ర్యాంక్, 715 మార్క్స్), అశిక అగర్వాల్ (11వ ర్యాంక్, 715 మార్క్స్), సాయన్ ప్రధాన్ (12వ ర్యాంక్, 715 మార్క్స్), హర్షిత్ బన్సాల్ (13 వ ర్యాంక్, 715 మార్క్స్), శశాంక్ కుమార్ (14వ ర్యాంక్, 715 మార్క్స్), కంచని జయంత్ రఘురామ్ రెడ్డి (15 వ ర్యాంక్, 715 మార్క్స్), శుభం బన్సాల్ (16వ ర్యాంక్, 715 మార్క్స్), భాస్కర్ కుమార్ (17వ ర్యాంక్, 715 మార్క్స్), దేవ్ భాటియా (18 వ ర్యాంక్, 715 మార్క్స్), ఆర్నాబ్ పాటి (19వ ర్యాంక్, 715 మార్క్స్), శశాంక్ సిన్హా (20వ ర్యాంక్, 715 మార్క్స్) ఉన్నారు. నిజానికి నాలుగవ ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకు పొందిన విద్యార్థులు, వారు సమానంగా సాధించిన మార్కుల ప్రకారం.. నాలుగవ ర్యాంక్ ను సంయుక్తంగా పొందినట్లే భావించవచ్చు.

Tue, 13 Jun 202304:24 PM IST

పెరిగిన కటాఫ్ శాతం; దాదాపు 20 మందికి 715 మార్కులు

2023 నీట్ యూజీ (NEET UG) లో కటాఫ్ (CUT OFF) మార్కులు అన్ని కేటగిరీల్లోనూ పెరగడం విశేషం. నీట్ యూజీ 2023 లో మొదటి ర్యాంకును సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన జే ప్రభంజన్ సాధించారు. మూడవ ర్యాంక్ ను 716 మార్కులతో కౌస్తబ్ బౌరి సాధించాడు. కాగా, నాలుగవ ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకు సాధించిన విద్యార్థులు అందరూ పొందిన మార్కులు 715 కావడం విశేషం. అంటే, దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు 715 మార్కులు సాధించారు.

Tue, 13 Jun 202303:55 PM IST

నీట్ యూజీ (NEET UG) ఫలితాలు వెలువడ్డాయి.. టాపర్ తెలుగువాడే..

నీట్ యూజీ (NEET UG) ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం నీట్ యూజీ (NEET UG) ఫలితాలను విడుదల చేసింది. ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in లో విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. నీట్ యూజీ 2023 ఫలితాల్లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి టాపర్ గా నిలిచాడు. అతడు 99.99 పర్సంటైల్ సాధించాడు. అలాగే, తమిళనాడుకు చెందిన మరో విద్యార్థి ప్రభంజన్ జే కూడా 99.99 పర్సంటైల్ తో టాపర్ గా నిలిచాడు. ఈ సంవత్సరం ఉత్తర ప్రదేశ్ నుంచి ఎక్కువమంది విద్యార్థులు నీట్ యూజీ లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్తాన్ ఉన్నాయి.

Tue, 13 Jun 202301:43 PM IST

రీ వాల్యుయేషన్ కు అవకాశం లేదు

నీట్ యూజీ ఫలితాలు వెలువడిన తరువాత.. విద్యార్థుల ఆన్సర్ షీట్స్ రీ వాల్యుయేషన్ కు కానీ, రీ చెకింగ్ కు కానీ ఎలాంటి అవకాశం ఉండదు. నీట్ యూజీ పరీక్షలో సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి మైనస్ 1 మార్క్ ఉంటుంది. ఏ సమాధానం ఇవ్వకపోతే.. ఎలాంటి మార్కులు ఉండవు. 

 

Tue, 13 Jun 202301:10 PM IST

మొత్తం 13 భాషల్లో నీట్ యూజీ పరీక్ష

నీట్ యూజీ 2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. అవి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, ఒడియా, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ. 

Tue, 13 Jun 202311:36 AM IST

నీట్ యూజీ రిజల్ట్ తెలుసుకోండి ఇలా..

నీట్ యూజీ ఫలితాలను విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తెలుసుకోవచ్చు.

  • మొదట neet.nta.nic.in. వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే NTA NEET UG Result 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • రిజల్ట్ చెక్ చేసుకుని, ఆ పేజ్ ను డౌన్ లోడ్ చేసుకుని, సేవ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

Tue, 13 Jun 202308:13 AM IST

లాగిన్​ వివరాలు..

అభ్యర్థులు.. తమ అప్లికేషన్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ వివరాలు సమర్పించి.. ఎగ్జామ్​ ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు.

Tue, 13 Jun 202308:03 AM IST

ప్రొవిజనల్​ కీ విడుదల..

మే 7, జూన్​ 6న జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్​ ఆన్సర్​ కీ ఇప్పటికే బయటకొచ్చింది. ఫలితాలతో పాటు ఫైనల్​ ఆన్సర్​ కీ విడుదల అవుతుంది.

Tue, 13 Jun 202307:53 AM IST

మే 7న పరీక్ష.. 

 

మణిపూర్​ మినహా దేశవ్యాప్తంగా నీట్​ యూజీ 2023.. మే 7న జరిగింది. మణిపూర్​లో ఈ నెల 6న పరీక్ష జరిగింది.

Tue, 13 Jun 202307:44 AM IST

వైద్య విద్యార్థులకు ముఖ్యమైన వెబ్​సైట్స్​..

మెడికల్​ కౌన్సిలింగ్​ కమిటీ : mcc.nic.in.

ఆయుష్​ అడ్మిషన్స్​ సెంట్రల్​ కౌన్సిలింగ్​ కమిటీ: aaccc.gov.in.

నేషనల్​ మెడికల్​ కమిషన్​ : nmc.org.in.

Tue, 13 Jun 202307:35 AM IST

ర్యాంకర్స్​ ఎవరు..?

నీట్​లో టాపర్స్​గా నిలిచిన వారి పేర్లను ఎన్​టీఏ ప్రకటిస్తుంది. ఇతరులు తమ ర్యాంక్​లను స్కోర్​కార్డుల్లో చూసుకోవాలి.

Tue, 13 Jun 202307:26 AM IST

సీట్ల రిజర్వేషన్​ లెక్కలు..

ఎస్​సీ-  ప్రతి కోర్సులో 15శాతం

ఎస్​టీ- ప్రతి కోర్సులో 7.5శాతం

పీడబ్ల్యూబీడీ- జనరల్​, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీఎన్​సీఎల్​, ఎస్​సీ, ఎస్​టీ సీట్లల్లో 5శాతం.

Tue, 13 Jun 202307:19 AM IST

నీట్​ ర్యాంక్​ చాలా కీలకం..!

వివిధ వైద్య కళాశాలల్లో చదువుకునేందుకు నిర్వహించేదే ఈ నీట్​ యూజీ ఎంట్రెన్స్​ ఎగ్జామ్​. ఎంబీబీఎస్​, బీడీఎస్​, బీఏఎంఎస్​, బీఎస్​ఎంఎస్​, బీయూఎంఎస్​, బీహెచ్​ఎంఎస్​, బీఎస్​సీ (హెచ్​) నర్సిగ్​ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తుంటారు

Tue, 13 Jun 202307:18 AM IST

అధికారిక వెబ్​సైట్​లో..

రిజల్ట్స్​ వెలువడిన తర్వాత.. neet.nta.nic.in లో వాటిని చెక్​ చేసుకోవచ్చు. అప్లికేషన్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

Tue, 13 Jun 202307:18 AM IST

నేడు నీట్​ యూజీ పరీక్ష ఫలితాలు..!

గత నెలలో నీట్​ యూజీ 2023 పరీక్ష జరిగింది. కాగా ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాలు నేడు వెలువడతాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.