NEET UG 2023 : నేడు నీట్ యూజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
NEET UG 2023 : నీట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. ఎక్కడ అప్లై చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
NEET UG 2023 Registration : దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2023 పరీక్ష మే 7న జరగనుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు, మార్చ్ 1న ప్రారంభకానుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నీట్ 2023..
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్తో పాటు ఇతర వైద్య అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. ఎయిమ్స్, జిప్మేర్, డీమ్డ్ వర్సిటీలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాశాలలు ఈ నీట్ స్కోరును పరిగణలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తూ ఉంటాయి. ఆయుష్ కోర్సులు, వెటర్నరీ కోర్సులకు కూడా నీట్ మార్కులు చూస్తూ ఉంటారు. నీట్ 2023 పరీక్షకు హాజరయ్యేందుకు కనీస వయస్సు 17ఏళ్లు. అభ్యర్థులు 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
NEET 2023 registration : ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగుతో పాటు ఉర్దూ భాషల్లో ఈ నీట్ యూజీ పరీక్షను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
నీట్ యూజీ 2023 రిజిస్ట్రేషన్ల కోసం ఇలా అప్లై చేసుకోండి..
స్టెప్ 1:- ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in. లోకి వెళ్లాలి.
స్టెప్ 2:- వెబ్సైట్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. NEET UG 2023 లింక్ మీద క్లిక్ చేయండి.
NEET 2023 registration date : స్టెప్ 3:- కొత్త ట్యాబ్లో ఓ పేజ్ లోడ్ అవుతుంది. మీ వ్యక్తిగత సమాచారం, అడ్రస్ వంటి వివరాలు ఫిల్ చేయండి.
స్టెప్ 4:- పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసి, సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
NEET UG 2023 exam date : స్టెప్ 5:- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కంప్లీట్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
నీట్ 2023 రిజర్వేషన్ కేటగిరీ..
NEET 2023 application date : ఎస్సీ- ప్రతి కోర్సులో 15శాతం.
ఎస్టీ- ప్రతి కోర్సులో 7.5శాతం.
పీడబ్ల్యూడీ- ఓపెన్, జెన్- ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్లలో 5శాతం.