NEET PG 2023: నీట్ పీజీ 2023 విద్యార్థులకు శుభవార్త; ఆ కటాఫ్ డేట్ పొడగింపు
నీట్ పీజీ 2023కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. నీట్ పీజీ 2023 (NEET PG-2023) కి అప్లై చేసుకోవడానికి వీలుగా, ఎంబీబీఎస్ విద్యార్థులు తమ ఇంటర్న్ షిప్ ను కంప్లీట్ చేసే తేదీని మరోసారి పొడగించింది.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నీట్ పీజీ 2023 (NEET PG-2023) పరీక్షకు అప్లై చేసుకోవడానికి ముందుగా, సంవత్సరం ఇంటర్న్ షిప్ (mandatory internship for MBBS students) ను కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్ షిప్ ను పూర్తి చేయాల్సిన తేదీని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక సారి పొడగించింది. ఇంటర్న్ షిప్ కంప్లీట్ చేసే తేదీని మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడగించింది.
ఇప్పుడు ఆగస్ట్ 11 వరకు..
తాజాగా, ఆ తేదీని మరోసారి పొడగిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు, నీట్ పీజీ 2023 (NEET PG-2023) కి అప్లై చేసుకోవాలంటే, ఆగస్ట్ 11 లోగా ఇంటర్న్ షిప్ ను ఎంబీబీఎస్ విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్ షిప్ ముగింపు తేదీని ఆగస్ట్ 11 వరకు పొడగిస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (National Board of Examinations NBEMS) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంటర్న్ షిప్ ను జులై 1 నుంచి ఆగస్ట్ 11 లోపు పూర్తి చేసిన ఎంబీబీఎస్ విద్యార్థులు నీట్ పీజీ 2023 (NEET PG-2023) కి అప్లై చేసుకోవడానికి అర్హులేనని National Board of Examinations NBEMS స్పష్టం చేసింది. ఆయా అభ్యర్థులు తమ ఫిబ్రవరి 9, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫిబ్రవరి 12 వరకు NEET PG-2023 కి అప్లై చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష కేంద్రాల అలాట్ మెంట్ ‘ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్’ విధానంలో ఉంటుందని వెల్లడించింది.
వాయిదా వేయాలి..
నీట్ పీజీ 2023 పరీక్ష (NEET PG-2023) మార్చి 5వ తేదీన జరగనుంది. కాగా, ఇప్పుడు ఇంటర్న్ షిప్ పూర్తి చేసే తేదీని ఎక్స్ టెండ్ చేసినందువల్ల, నీట్ పీజీ 2023 (NEET PG-2023) ని కూడా వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో MS, MD, PG Diploma కోర్సుల్లో ప్రవేశానికి ఈ నీట్ పీజీ (NEET PG National Eligibility cum Entrance Test for Post Graduate) పరీక్షను ఏటా నిర్వహిస్తారు.