NEET PG 2023 Exam: నీట్ పీజీ పరీక్షపై ఫేక్ న్యూస్ నమ్మకండి
NEET PG 2023 exam: నీట్ పీజీ 2023 పరీక్షలకు సంబంధించిన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ నోటీస్ ను నమ్మవద్దని కేంద్రం అభ్యర్థులకు సూచించింది. ఆ ఫేక్ నోటీస్ వివరాలను వెల్లడిస్తూ, ఆ నోటీస్ లోని తేదీలు సరైనవి కావని స్పష్టం చేసింది.
నీట్ పీజీ 2023 (NEET PG 2023) పరీక్షలకు సంబంధించిన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ నోటీస్ ను నమ్మవద్దని కేంద్రం అభ్యర్థులకు సూచించింది. ఆ ఫేక్ నోటీస్ వివరాలను వెల్లడిస్తూ, ఆ నోటీస్ లోని తేదీలు సరైనవి కావని స్పష్టం చేసింది.
NEET PG 2023 exam fake notice: నకిలీ నోటీసులో ఏముంది?
నీట్ పీజీ 2023 (NEET PG 2023) పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఫేక్ నోటీస్ (NEET PG 2023 fake notice) ను నమ్మవద్దని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. నీటీ పీజీ 2023ని (NEET PG 2023 fake notice) రీషెడ్యూల్ చేశారని ఆ ఫేక్ నోటీసులో ఉంది. ఆ ఫేక్ నోటీస్ ప్రకారం.. ‘‘నీట్ పీజీ 2023 పరీక్ష 2023 మే 21 న జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్స్ ను ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25 వరకు ఆన్ లైన్ లో సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ ఫామ్ ల్లో తప్పులను సరి చేసుకోవడానికి ఎడిట్ విండో మార్చి 29 నుంచి ఏప్రిల్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. జూన్ 20, 2023న ఫలితాలను వెల్లడిస్తారు’’. అయితే, ఈ డేట్స్ అన్నీ తప్పు అని, సోషల్ మీడియాలో ఈ డేట్స్ తో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న నోటీసును నమ్మవద్దని కేంద్రం నీట్ అభ్యర్థులను హెచ్చరిస్తోంది. సంబంధిత ఫేక్ నోటీసు (NEET PG 2023 fake notice) ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఇలాంటి ఫేక్ మెసేజ్ లను షేర్ చేయవద్దని సూచించింది.
NEET PG 2023 exam original schedule: ఒరిజినల్ షెడ్యూల్ ఏంటి?
నీట్ పీజీ 2023 (NEET PG 2023) పరీక్ష ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. నీట్ పీజీ 2023 (NEET PG 2023) కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తారు. అలాగే, నీట్ పీజీ 2023 పరీక్ష (NEET PG 2023) మార్చి 5న జరుగుతుంది. పూర్తి వివరాలు, రెగ్యులర్ అప్ డేట్స్ కోసం అభ్యర్థులు తరచుగా ఎన్బీఈ (NBE) అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. మరే ఇతర వెబ్ సైట్స్ లో వచ్చే తప్పుడు వార్తలను విశ్వసించవద్దు.
టాపిక్