NEET PG 2023 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల; రిజిస్ట్రేషన్, సీట్ అలాట్మెంట్ వివరాలు..
NEET PG 2023 Counselling: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పీజీ వైద్య విద్యలో ప్రవేశాల కౌన్సెలింగ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నీట్ పీజీ 2023 (NEET PG 2023) రాసిన అభ్యర్థులు mcc.nic.in. వెబ్ సైట్ ద్వారా ఈ కౌన్సెలింగ్ రిజిస్టర్ చేసుకోవచ్చు.

నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్
నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ కు రిజిస్ట్రేషన్ జులై 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ కు రిజిస్టర్ చేసుకోవడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 1. విద్యార్థులు ఎంసీసీ అధికారిక వెబ్ సైట్ mcc.nic.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎండీ, ఎంఎస్, డిప్లొమా, పీజీ డీఎన్బీ తదితర నీట్ పీజీ అడ్మిషన్లకు సంబంధించి 50% ఆల్ ఇండియా కోటా (AIQ), డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఏఎఫ్ఎంఎస్ ల్లో 100% సీట్లకు ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. చాయిస్ ఫిల్లింగ్, లేదా చాయిస్ లాకింగ్ సదుపాయం జులై 28న ప్రారంభమై, ఆగస్ట్ 2న ముగుస్తుంది.
సీట్ అలాట్మెంట్ ఎప్పుడు?
సీట్ అలాట్మెంట్ ఆగస్ట్ 3, ఆగస్ట్ 4 తేదీల్లో జరుగుతుంది. సీట్ల అలాట్మెంట్ కు సంబంధించి తుది ప్రకటన ఆగస్ట్ 5వ తేదీన జరుగుతుంది. సీట్స్ అలాట్ అయిన విద్యార్థులు తమ డాక్యుమెంట్లను ఆగస్ట్ 6వ తేదీ నుంచి mcc.nic.in. వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయవచ్చు. అలాగే, ఆగస్ట్ 7వ తేదీ నుంచి ఆగస్ట్ 13వ తేదీ వరకు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జాయిన్ అయిన విద్యార్థుల డేటా వెరిఫికేషన్ ఆగస్ట్ 14వ తేదీ నుంచి ఉంటుంది. పూర్తి వివరాలకు ఎంసీసీ వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను పరిశీలించండి.